Posted on 2025-02-18 12:00:23
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రోడ్డు ప్రమాద నివారణలో భాగంగా నియోజకవర్గ పరిధిలో ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో అండర్ పాస్ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 44 నెంబర్ జాతీయ రహదారి ఉన్న ప్రాంతాలలో కొత్తూరు, పెంజర్ల, మేక గూడా, చటాన్ పల్లి, బూర్గుల గ్రామాల పరిధిలో అండర్ పాస్ మార్గాల అవసరం ఉందన్నారు. అయితే ప్రస్తుతం కేశంపేట్, చటాన్ పల్లి మార్గాలను కలిపేలా ఒక అండర్ పాస్ నిర్మాణం జరుగుతుందన్నారు. అదేవిధంగా బూర్గుల, రాయికల్ మార్గాలను కలిపేలా మరో అండర్పాస్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇక జహంగీర్ పేరు దర్గా, నందిగామ మధ్యన ఈ రెండు మార్గాలను కలిపేలా మరో అండర్పాస్ నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు.రూ. 100 కోట్లతో ఈ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. మార్చి చివరిలో గాని, ఏప్రిల్ మొదటి వారంలో గాని పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఆయా ప్రాంతాలలో వరుస క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకువెళ్లడం జరిగిందని, ఆయన స్పందించి దీనికోసం నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. త్వరలో మిగతా చోట్ల కూడా అండర్ పాస్ నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య, కొత్తూరు ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >