| Daily భారత్
Logo




తెలంగాణ ప్రతీక బతుకమ్మ విశిష్ఠత

Devotional

Posted on 2024-10-02 09:03:55

Share: Share


తెలంగాణ ప్రతీక బతుకమ్మ విశిష్ఠత

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక బతుకమ్మ. ఆడబిడ్డలంతా సంబురంగా జరుపుకొనే ఘనమైన వేడుక ఇది. ప్రకృతిని ఆరాధిస్తూ సాగే పూల పండుగ బతుకమ్మ.

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో మరెక్కడా కనిపించని, తెలంగాణకు మాత్రమే సొంతమైన వినూత్నమైన, అరుదైన పూలవేడుక బతుకమ్మ. పూలతో దేవుడిని కొలవడం కాదు.. పూలనే దేవుడిలా కొలిచే వేడుక ఇది. బతుకమ్మ అంటే బతుకుదెరువును మెరుగుపరిచే అమ్మ అని అర్థం. తొమ్మిది రోజులు తెలంగాణ అంతటా ఒక జాతరలా సాగి చివరిరోజు సద్దుల బతుకమ్మగా మన వాకిట్లో బతుకుదెరువును ఆవిష్కరిస్తుంది. ఆటపాటలతో మనల్ని సేదతీరుస్తుంది. జీవన సంబురాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో మాత్రమే జరుపుకొనే పండుగ బతుకమ్మ. స్వరాష్టంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొంది నేడు ప్రపంచంలో తెలంగాణవారున్న చోటల్లా పూలజాతరై వర్ధిల్లుతోంది. ఆడబిడ్డలంతా ఒక్కచోట చేరి వాడవాడలా నిర్వహించే ఉత్సవమే బతుకమ్మ. 

ప్రకృతిలో లభించే ప్రతి పువ్వునూ..

బతుకమ్మ వేడుకను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. భాద్రపద అమావాస్య లేదా పెత్రమాస రోజు నుంచి అశ్వయుజ అష్టమి వరకు తొమ్మిది రోజులు ఈ సంబురం కొనసాగుతుంది. ఆడబిడ్డలంతా చివరి రోజు అశ్వయుజ అష్టమి నాడు ఉపవాసం పాటిస్తూ, స్నానాధికాలు ముగించుకుని, ముందుగా చిన్న బతుకమ్మను పేరుస్తారు. గౌరమ్మను నిలుపుకొంటారు. అంతేకాకుండా సద్దులు సమర్పిస్తారు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వునూ ఏరికోరి తెచ్చి, బతుకమ్మలను పేరుస్తారు. అంతేకాకుండా బతుకమ్మ వేడుకలో ఉపయోగించే పూవుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. పూల నుంచి వచ్చే పరిమళాలు, వాటి లేలేత స్పర్శ ఆరోగ్యాన్ని పెంచుతాయన్నది నిపుణుల మాట. రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన గౌరమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ ఆడే వేడుక బతుకమ్మ.

Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >
Image 1

బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-15 06:39:17

Readmore >
Image 1

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-14 22:44:54

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

Posted On 2026-01-14 18:45:43

Readmore >
Image 1

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-01-14 17:46:55

Readmore >
Image 1

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-01-14 17:45:54

Readmore >
Image 1

సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

Posted On 2026-01-14 17:44:56

Readmore >
Image 1

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-01-14 17:43:41

Readmore >
Image 1

గల్ఫ్ మృతదేహం తరలింపు... ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

Posted On 2026-01-14 17:39:34

Readmore >
Image 1

బ్యాగ్‌ బరువు ఉండదక్కడ

Posted On 2026-01-14 15:26:21

Readmore >