| Daily భారత్
Logo




బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్

News

Posted on 2024-09-23 10:09:51

Share: Share


బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్

డైలీ భారత్, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి వద్ద బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన త్రిసభ్య కమిటీ సభ్యులను అరెస్ట్ చేయటమా? .. అసలు ప్రభుత్వానికి ఎందుకంత భయం? .. కమిటీ తన పని తాను చేసుకొని పోతే నిజం బయటపడుతుందనా?.. అసమర్థ చేతగాని ప్రభుత్వం అసలు రంగు బయట పడుతుందనా?’’ అంటూ ట్వీట్ చేశారు..

‘‘నిజంగా ప్రభుత్వం ఏమీ దాచటం లేదంటే బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీని దర్యాప్తు చేయనివ్వండి. కమిటీ నివేదిక ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి తెలుస్తాయి. ప్రజారోగ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వానికి సూచనలు అందుతాయి. కానీ ముఖ్యమంత్రి మాత్రం అవేవి జరగవద్దన్న ఇగోతో వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ ప్రజల జీవితాలతో సీఎం చెలగాటం ఆడుతున్నాడు. ఇలాంటి పిచ్చి పనులను సీఎం మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

కాగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ త్రీ మెన్ కమిటీని నియమించింది. ఈరోజు ఉదయం 10 గంటలకు గాంధీ ఆస్పత్రికి బీఆర్ఎస్ నేతలు తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే సంజయ్, మెతుకు ఆనంద్ వెళ్లాల్సింది. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు కమిటీ మెంబర్స్‌ను హౌజ్ అరెస్ట్ చేశారు. తమను పోలీసులు అడ్డుకుంటున్నారని, హౌజ్ అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. త్రిసభ్య కమిటీలో ఆనంద్ సభ్యుడిగా ఉన్నారు. గాంధీ ఆసుపత్రికి వెళ్లనీయకుండా ఆనంద్‌ను పోలీసులు ఇంట్లోనే ఉంచారు. విషయం తెలిసిన కార్యకర్తలు భారీగా ఆనంద్ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ఇంట్లోకి పోలీసులు వెళ్లకుండా కార్యకర్తలు అడ్డంగా కూర్చున్నారు. మరోవైపు ఆనంద్ ఇంటి చుట్టూ పోలీసులు పహారాకాస్తున్నారు.. 

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >