| Daily భారత్
Logo




మున్సిపల్ చైర్ పర్సన్ కళ చక్రపాణి చేతుల మీదగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ

News

Posted on 2024-09-06 15:19:58

Share: Share


మున్సిపల్ చైర్ పర్సన్  కళ చక్రపాణి చేతుల మీదగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు మునిసిపల్ కార్యాలయం లో కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్  కళ చక్రపాణి చేతుల మీదగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్  జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ వినాయక విగ్రహాలు నెలకొల్పే భక్తులందరూ సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తొందరగా నీటిలో విలీనం అవ్వకుండ మరియు వినాయక విగ్రహాల తయారీలో వాడిన రసాయన రంగుల వల్ల నీటి కాలుష్యం ఏర్పడి పర్యావరణానికి హాని జరిగే  ప్రమాదం ఉంది అని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ అదేవిధంగా పర్యావరణం ను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సాధ్యమైనంత వరకు భక్తులు మట్టి విగ్రహాలను సహజ రంగులని వాడిన వినాయక విగ్రహాల ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని కోరుతున్నాను అని అన్నారు ..

మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహాత్ అలీ బేగ్ మాట్లాడుతూ.. 

ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే వినాయక చవితి పండగలో భాగంగా భక్తులందరూ మట్టి విగ్రహాలనే వాడి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని అన్నారు...

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ , బొల్గం నాగరాజు , అన్నారం శ్రీనివాస్ , పత్తిపాక పద్మ శంకర్ ,  కల్లూరి రాజు గూడూరి భాస్కర్. ఒగ్గు ఉమా రాజేష్ , గార్ల కీర్తన సందీప్ , టిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది సిరిసిల్ల ప్రజలు పాల్గొన్నారు..

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >