Posted on 2024-09-06 04:46:16
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణం శరణబసప్ప కాలనీలోని కాకతీయ పాఠశాలలో గురువారం పాఠశాల డైరెక్టర్ వంశీ కృష్ణ ,బాలాత్రిపురసుందరి దేవి ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంయుక్త ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దిననోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ వంశీ కృష్ణ,బాలాత్రిపురసుందరి ప్రధానోపాధ్యాయురాలు సంయుక్త మాట్లాడుతూ విద్యావేత్తగా, తత్వవేత్తగా విజయవంతమైన ప్రయాణాన్ని సాగించి ఘన చరిత్ర సాధించి చరిత్ర పుటల్లో నిలిచిన రాధాకృష్ణన్ భారత దేశానికి చేసిన సేవ ఎనలేనిది. భారతదేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా ఎనలేని సేవలందించిన రాధాకృష్ణన్ విషయంలో ఆయన తండ్రి మనసు మారకుంటే, రాధాకృష్ణన్ పూజారిగానే స్థిరపడి ఉంటే ఈనాడు భరతజాతి గొప్ప విద్యావేత్త, తత్వవేత్త అయిన ఈ మహోన్నతమైన వ్యక్తిని భారత రాష్ట్రపతిగా చూసి ఉండేవారం కాదేమో! అందుకే అంటారు కదా.ప్రతి గురువు తన శిష్యులు తనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలని సమాజంలో గౌరవాన్ని దక్కించుకుంటే అదే తమకు గర్వకారణం అన్నారు. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందించే అవకాశం ప్రపంచంలో కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే దక్కుతుందన్నారు. ప్రతి విద్యార్థి తమ ఉన్నతికి కారణమైన గురువులను ఈ సందర్బంగా సత్కరించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు తమ అటపాటలతో గురువులను అలరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు విజయలక్మి, రాజేశ్వరి, సౌజన్య,నీతూ శర్మ,రాజేష్,నర్మదా,రజిత, రాధ, ప్రసన్న,సబిత,శ్రీ నిత్య, జానకి, సరిత, సంయుక్త, నవీన, అలైదీత,రఘు,గీతాంజలి, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >