| Daily భారత్
Logo




కేసీఆర్, స్మితా సబర్వాల్‌కు కోర్టు సమన్లు

News

Posted on 2024-09-06 04:52:16

Share: Share


కేసీఆర్, స్మితా సబర్వాల్‌కు కోర్టు సమన్లు

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది.

అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల ప్రజా ధనానికి భారీ నష్టం వాటిల్లిందని భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్, మరో ఏడుగురికి నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్నవారిలో మాజీ మంత్రి హరీశ్ రావు తరపున లలిత రెడ్డి, సుకన్య, అడ్వకేట్లు మెమో అప్పిరియన్స్ అయ్యారు. మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్అండ్ టీ ఎండీ సురేశ్ కుమార్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ అవదాని, శ్రావణ్ రావు మెమో అప్పిరియన్స్ అయ్యారు.

ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్లు హరి రామ్, శ్రీధర్ తరపున వరంగల్ అడ్వకేట్ నరసింహారెడ్డి మెమో అప్పిరియన్స్ అయ్యారు. అయితే, ఈరోజు మాత్రం మాజీ కేసీఆర్, ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరుకాకపోవడంతో అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. 

ఇది ఇలావుండగా, కేసీఆర్ కనబడుట లేదు అంటూ హైదరాబాద్ నగరంలో బుధవారం పలు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తా లేడు అంటూ సదరు పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే, ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం తెలియరాలేదు.

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో మృతి చెందగా, వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఖమ్మంతోపాటు పలు జిల్లాల్లోనూ భారీ పంట నష్టం జరిగింది.

అయినప్పటికీ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ వరద బాధితులను పరామర్శించేందుకు బయటకు రాకపోవడంపై ఇప్పటికే అధికార పక్షం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కనబడుట లేదు అంటూ పోస్టుర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. కేసీఆర్ ప్రజల్లోకి రాకపోయినప్పటికీ.. హరీశ్ రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >