Posted on 2024-09-04 18:00:01
ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి విమర్శలు
దాడులను తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు
మంత్రి సీతక్క పై ఎమ్మెల్సీ నవీన్ విసర్లు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : వరద బాధితులను ఆదుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు మానవతా దృక్పథంతో ముందుకు వస్తే కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారని దీనిని యావత్తు తెలంగాణ సమాజం ఖండిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
బుధవారం హైదరాబాద్ లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక కుటుంబానికి కూడా సరిపడా సరుకులు తీసుకెళ్లకుండా సోషల్ మీడియాలో సాయం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుందని నవీన్ కుమార్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు.
వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సాయం పదివేల రూపాయలు సొంతంగా చేస్తున్నారా లేదా ప్రభుత్వం నుండి ఇస్తున్నారా స్పష్టత ఇవ్వాలని అన్నారు.
బాధితులకు కనీసం రెండు నెలలకు సరిపడా సరుకులు సరఫరా చేస్తే న్యాయం జరుగుతుందని అన్నారు. పదివేల రూపాయలు ప్రభుత్వం నుండి ఏమాత్రం సరిపోవని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రి సీతక్క గతంలో వరదల సమయంలో ఎన్నో మాటలు మాట్లాడారని ఆనాడు హెలికాప్టర్ ఇస్తే సాయం చేస్తానని అడిగినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వము మంత్రులు అధికారము హెలికాప్టర్లు కూడా మీ వద్దే ఉన్నాయని మరి ఎందుకు సాయం చేయడం లేదని మీడియా ముఖంగా మంత్రి సీతక్కను ప్రశ్నించారు.
వరద వస్తుందని ఖమ్మం ప్రజలకు ముందు చెప్పలేదు. ఇదే ప్రభుత్వ ఫెయిల్యూర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శనివారం 21 అడుగులకు నీటిమట్టం చేరింది, 21 అడుగులకు చేరిన ఒక ఇల్లు కూడా మునగదన్నారు. కాకపోతే నీటిమట్టం 18 అడుగులకు చేరగానే మైకులలో అనౌన్స్‌మెంట్ ఇచ్చి ట్రాక్టర్లు వ్యాన్లు తీసుకొచ్చి ప్రజలను సామగ్రితో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
ఆదివారం ఉదయం 33 అడుగులకు నీటిమట్టం చేరింది.
అప్పటికి ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు చేయలేదని ఆరోపించారు. ప్రజలే స్వచ్ఛందంగా అయ్యో రామచంద్ర అని అనుకుంటూ వారి సోమాగ్రిని వదిలేసి వేరే ప్రాంతంలోకి వెళ్లిపోయారన్నారు. మాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రజల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. రిలీఫ్ మెజర్స్ తీసుకోవడంలో బాధితులకు ఆహారం, నీళ్లు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి నాపై తప్పుడు ఆరోపణలు చేశారని పువ్వాడ అన్నారు..
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >