Posted on 2024-09-05 12:30:44
డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: రాజకీయ నేతలు రొమాన్స్ వీడియోలతో అడ్డంగా దొరికిపోతున్నారు. ఏ పార్టీ వారైనా.. ఇందులో ఇరుక్కుపోయి తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంటున్నారు. తాజాగా ఏపీలో ఓ ఎమ్మెల్యే రొమాంటిక్ టేప్స్ కలకలం రేపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇంతకీ ఆయనెవరో తెలుసా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.
ఈ వ్యవహారం ఇంటాబయటా హాట్ టాపిక్‌గా మారింది. మత్తు మందు ఇచ్చి తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారన్నది బాధితురాలి ఆరోపణ. చెల్లి, చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని పేర్కొంది. తనపై చేసిన అఘాయిత్యానికి పాల్పడిన వీడియోను రిలీజ్ చేసింది.
ఎమ్మెల్యే అత్యాచారం ఆరోపణలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధి అయి ఉండి ఇలాంటి నీచమైన పనులు చేయడం దారుణమని వాపోతున్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు కోనేటి ఆదిమూలం. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఎమ్మెల్యే తనపై ఒత్తిడి తెచ్చాడని, వేధింపులు భరించలేక లొంగిపోయానని మనసులోని మాట బయటపెట్టింది బాధితురాలు. ఈ వ్యవహారం తన కుటుంబంలో చిచ్చురేపిందని తెలిపింది. ఆయన వ్యవహారాలు బయటపెట్టేందుకు సీక్రెట్ కెమెరాతో రికార్డు చేసి మీడియాకు ఇచ్చినట్టు తెలిపింది.
తన ప్రాణానికి హాని ఉందంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది బాధితురాలు. అర్థరాత్రి వేళ వీడియో కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, తన ఇంట్లో గొడవలు తీవ్రమైనట్లు చెప్పింది. ఇప్పుడు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు గోడు వెల్లబోసుకుంది.
రాసలీలల వీడియోపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోతో తనకు సంబంధం లేదని, మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. ఆ వీడియో ఎలా వచ్చిందో దేవుడికే తెలియాలన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
Posted On 2025-02-14 12:59:03
Readmore >మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Posted On 2025-02-14 11:01:32
Readmore >అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Posted On 2025-02-14 09:54:09
Readmore >మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2025-02-13 20:31:33
Readmore >రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
Posted On 2025-02-13 08:02:45
Readmore >బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి
Posted On 2025-02-12 23:33:40
Readmore >