| Daily భారత్
Logo




ఎమ్మెల్సీగా తన ఒక నెల జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా అందచేసిన తీన్మార్ మల్లన్న

News

Posted on 2024-09-03 16:02:17

Share: Share


ఎమ్మెల్సీగా తన ఒక నెల జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా అందచేసిన తీన్మార్ మల్లన్న

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వరద బాధితులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భారీ సాయం ప్రకటించారు. ఎమ్మెల్సీగా తన ఒక నెల జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ స్థాయిలో వచ్చిన వరదల కారణంగా దాదాపు 5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ మూడు జిల్లాల్లో జనజీవనం స్థంభించిందని, ప్రజల నిత్యావసరాలు వరదలో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉన్న విచారకరమైన సందర్భంలో వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్సీగా తనకు వచ్చే నెల జీతం 2 లక్షల 75 వేల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. వరద భాదితులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలిపారు. అలాగే మిగిలిన ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా తమ నెల శాలరీ విరాళంగా ఇచ్చి వరద బాధితులను ఆదుకోవాలని తీన్మార్ మల్లన్న రిక్వెస్ట్ చేశారు.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >