| Daily భారత్
Logo




వీధి కుక్కలను పునరావాస కేంద్రాలకు తరలించండి

News

Posted on 2024-08-03 10:41:01

Share: Share


వీధి కుక్కలను పునరావాస కేంద్రాలకు తరలించండి

వీధి కుక్కలను పునరావాస కేంద్రాలకు తరలించండి..

ఫిర్యాదుల స్వీకరణకు హెల్ప్‌లైన్‌ ఉండాలి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

డైలీ భారత్, హైదరాబాద్‌ : చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, సంబంధిత స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.

యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ) రూల్స్‌ ప్రకారం కుక్కల జననాలను తగ్గించాల్సి ఉందని తెలిపింది. నగరం బయట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. కుక్కల బెడదపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి స్థానిక అథారిటీలు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. 

ఏబీసీ రూల్స్‌లోని 10, 11, 15, 16 నిబంధనలు అమలు చేసి అమలు నివేదికను సమర్పించాలని పేర్కొంది. కుక్కల దాడులపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన పిటిషన్‌తోపాటు ఇదే అంశంపై దాఖలైన పలు పిటిషన్‌లపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఆదేశాల మేరకు యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ ఇంప్లిమెంటేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీని జీవో 315 ద్వారా ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >
Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >