| Daily భారత్
Logo




మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గుడుంబా స్టావారాలపై పోలీస్ దాడులు

News

Posted on 2024-08-03 10:15:29

Share: Share


మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గుడుంబా స్టావారాలపై పోలీస్ దాడులు

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశాల మేరకు గుడుంబా స్థావారాలపై ఈరోజు తెల్లవారుజామున నుండి దాడులు నిర్వహించి గ్రామస్థులకు గుడుంబా వాళ్ళ జరిగే నష్టాల గురించి, వాటితో పాటు కొత్త చట్టాలు, సైబర్ నేరలు, గంజాయి, ఆన్లైన్, ఆర్ధిక మోసాలు, బాల్య వివాహాలు,లైంగిక దాడులు మరియు కఠిన శిక్షల పైన అవగాహన కలిపించిన మహబూబాబాద్ జిల్లా పోలీసులు అధికారులు మరియు సిబ్బంది.

ఈ దాడులలో జిల్లా పరిధిలో మొత్తం 272 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని, నల్ల బెల్లం 50 కేజీలు, 8330 లీటర్ల చెక్కెర పానకాన్ని ధ్వంసం చేసి 29 కేసులు నమోదు చేయడం జరిగిందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ప్రకటనలో తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా జరిపిన ఈ దాడులలో డిఎస్పీలు , సీఐలు , ఎస్.ఐలు మరియు సిబ్బంది కలిపి 124 మంది పాల్గొన్నారు. 

మహబూబాబాద్ జిల్లా లో ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారీ చేసినట్లయితే వారిని బైండోవర్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దాడులు నిర్వహించిన అనంతరం గ్రామస్థులకు గుడుంబా వాళ్ళ జరిగే నష్టాలని వివరించి  అవగాహన కల్పించారు.

నూతన చట్టాలు గురించి, సైబర్ నేరాలు, ఆన్లైన్, ఆర్ధిక మోసాలు,గంజాయి, గుట్కా,బాల్య వివాహాలు,లైంగిక దాడుల గురించి, కొత్త చట్టాలు అమలు చేసే కఠినమైన శిక్షల గురించి అవగాహన కల్పించారు.

అంతే కాకుండా మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబా తయారీ చేస్తునట్టు తెలిసిన అమ్మిన వెంటనే దగ్గరలోని పోలీసు స్టేషన్ లో సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు గొప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.

Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >
Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >