| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి మా మద్దతు : ఆనంద్ మహీంద్ర

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి మా మద్దతు : ఆనంద్ మహీంద్ర

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని నివాసంలో  మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర కలిశారు.రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై చర్చించారు.తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ  గురించిన ముఖ్యమంత్రి  వివరించగా,స్కిల్ వర్సిటీలో బోధించే 17 విభాగాల్లో ఒకటైన "ఆటోమోటివ్ డిపార్ట్‌మెంట్‌"ను దత్తత తీసుకోవడానికి ఆనంద్ మహీంద్ర  అంగీకరించారు. ఆ కోర్సుకు సంబంధించిన కరికులం తయారీ కోసం మహీంద్రా గ్రూప్ నుంచి నిపుణుల బృందాన్ని కూడా పంపుతామన్నారు. హైదరాబాద్‌లోని క్లబ్ మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణకు సహకరించాల్సిందిగా ఆనంద్ మహీంద్ర ముఖ్యమంత్రిని కోరారు..

Previous వీధి కుక్కలను పునరావాస కేంద్రాలకు తరలించండి
Next శాసనసభ గౌరవాన్ని హుందాతనాన్ని కాపాడాము : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT