| Daily భారత్
Logo




శాసనసభ గౌరవాన్ని హుందాతనాన్ని కాపాడాము : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-08-03 12:12:50

Share: Share


శాసనసభ గౌరవాన్ని హుందాతనాన్ని కాపాడాము : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సూటిగా ప్రశ్నించా.. గత వైఫల్యాలను ఎండగట్టా..!

అసెంబ్లీ సమావేశాలు సంతృప్తినిచ్చాయి

ప్రభుత్వ అభివృద్ధిపై ప్రతిపక్ష మొండి వాదన

ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయకుండా అభివృద్ధిని వినిపించి శిక్షించాం

ఎమ్మెల్యేల ప్రసంగాలు చూసి ప్రతిపక్షం కుళ్ళుకుంది

గత ప్రభుత్వం అభివృద్ధిని వదిలేస్తే ప్రజాపాలనలో వాటిని మేము మొదలుపెట్టాం

నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడడానికి అనేక అవకాశాలు కల్పించారు

షాద్ నగర్ నుండి పరిగి మీదుగా కొడంగల్ వరకు 4లైన్ల రహదారి విస్తరణ

నియోజకవర్గంలో దాదాపు 140 కోట్ల వరకు రుణమాఫీ

అర్హత కలిగిన వారికి డబుల్ బెడ్ రూములు

ధరణి తప్పులపై శాసనసభలో చీల్చి చెండాడినం

రాష్ట్రంలో మొదటిసారిగా పారదర్శకమైన బదిలీలు 

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గ అభివృద్ధిపై సూటిగా మాట్లాడాము.. గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా ఆధారాలతో ఎండగట్టాం.. అభివృద్ధిపై మాట్లాడడానికి కొత్త సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ ఎంతో అవకాశం కల్పించారు. శాసనసభ జరిగిన విధానం ఎమ్మెల్యేలకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. కొత్త ఎమ్మెల్యేలు ప్రతిపక్షం ఉదాసీనత గురించి మాట్లాడితే జీర్ణించుకోలేకపోయారని తమను ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారని, అయినా ఎక్కడ తగ్గకుండా సమావేశాలను విజయవంతంగా పూర్తి చేశామని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ అనుభవాల గురించి మాట్లాడారు. ఎన్నో ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. 

కొత్త సభ్యులను చూసి కుళ్ళుకున్నారు..

సభలో ఉన్న కొత్త సభ్యులు (ఎమ్మెల్యేలు) గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడితే ప్రతిపక్ష విఆర్ఎస్ నాయకులు తమను చూసి కుళ్ళుకున్నారని, తమను విమర్శనాత్మకంగా చూశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేవలం మంజూరీలు ప్రోసిడింగులు శంకుస్థాపనలు చేసి కాలయాపన చేసిన విధానం, పనులు మంజూరు చేసి నిధులు కేటాయించగా నిర్లక్ష్యం చేసిన పనులను తాము మొదలుపెట్టిన విధానాలను సభ దృష్టికి తీసుకు వచ్చామని చెప్పారు. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీ సభ్యుల ప్రసంగాలపై కామెంట్లు చేశారని అన్నారు. తమ ముందు మాట్లాడుతుంటే వెనకాల ఆట పట్టించే విధంగా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేవారని ఎమ్మెల్యే శంకర్ తన అనుభవాలను చెప్పారు. మిగతా విపక్ష సభ్యులు మాత్రం హర్షించేవారని పేర్కొన్నారు. 

అభివృద్ధిపై మాట్లాడితే సహకరించారు..

షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై అనేక విషయాలు సభలో ప్రస్తావించేందుకు అధ్యక్షులు అనుమతించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ధన్యవాదాలు అని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. షాద్ నగర్ నుండి పరిగి మీదుగా కొడంగల్ వరకు నాలుగో లైన్ల రహదారి మంజూరు కోసం ప్రభుత్వానికి వినతి చేసినట్లు చెప్పారు దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అదేవిధంగా అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాల విషయంలో నిధుల కేటాయింపు, నూతన రోడ్లకు మహార్దశ, కొన్ని గ్రామాలలో భవనాలు, హైటెక్ వంతెనలు తదితర అంశాలపై శాసనసభలో తాము అడిగిన సమస్యలకు పరిష్కారం లభించిందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం కేవలం పనులు మంజూరు చేసి ప్రొసీడింగులు ఇచ్చి కాంట్రాక్టర్లకు చిల్లిగవ్వ ఇవ్వలేదని అందుకే అభివృద్ధి పనులు ఎక్కడి ఒక్కడే ఆగిపోయాయని వాటిని తాము పున ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. 

సభలో మంచి అవకాశం కల్పించారు

శాసనసభలో తమ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి అవకాశాన్ని కల్పించాలని చెప్పారు. సభలో ఈ సందర్భంగా మొదట బీసీ సంక్షేమం బడ్జెట్ కేటాయింపు పై ప్రసంగం చేసే అవకాశం దక్కిందని అన్నారు. 

ఈ సందర్భంగా బీసీ వసతి గృహాల పనితీరు మౌలిక వసతులు విద్య గురించి సభలో చర్చించినట్లు చెప్పారు. అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యపై సభలో చర్చించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో బీసీ వసతి గృహాలపై తీవ్ర నిర్లక్ష్యం చేశారని తీవ్ర నిర్లక్ష్యం చేశారని వివరించారు. వసతి గృహాల వ్యవస్థలో నిర్వహణ విద్వాసం సృష్టించారని ఆవేదన చెందారు. ఇక బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన బడ్జెట్ పై సుదీర్ఘంగా ప్రభుత్వ ధన్యవాదాలు ప్రసంగం తదితర అంశాలను సభ దృష్టికి తెచ్చినట్టు చెప్పారు.

గత ప్రభుత్వం పాత హైవేలో అసంపూర్తి పనులు చేపడితే ప్రజా పాలనలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటిని దగ్గరుండి పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా వివరించారు. అదేవిధంగా 50 పడకల ఆసుపత్రికి మంజూరు ఇచ్చి కాంట్రాక్టర్ కు చిల్లిగవ్వ ఇవ్వలేదన్న విషయాన్ని మరోసారి ప్రస్తావించారు.

దాదాపు 140 కోట్ల వరకు..

షాద్ నగర్ అసెంబ్లీ పరిధిలో 6 మండలాలకు దాదాపు నూట నలభై కోట్ల రూపాయల వరకు రైతు రుణమాఫీ ఇచ్చేలా చూసామని పేర్కొన్నారు. దీనిపై సభలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినట్టు పేర్కొన్నారు. కని విని ఎరుగని రీతిలో ప్రభుత్వం రైతాంగం అప్పులు తన భుజస్కంధాన వేసుకొని తీర్చడం ఎంతో గొప్ప విషయం అని ప్రభుత్వాన్ని కొనియాడారు. 

రైతు రుణమాఫీ పై కూడా బురదజల్లే ప్రయత్నం ప్రతిపక్షం చేసిందని అన్నారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన నిలబడి గొంతెత్తి తమకు న్యాయం ఆర్థిక న్యాయం జరిగిందని చెప్పడంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు తోక మీడిచే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా చెప్పారు. 

అర్హులకే డబుల్ బెడ్ రూములు..

షాద్ నగర్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ విషయంలో ప్రభుత్వం నుండి నియమ నిబంధనలు కోరినట్లు ఎమ్మెల్యే శంకర్ చెప్పారు. అర్హులకే ఇండ్లు అందే విధంగా అధికారులకు త్వరలోనే గైడ్ లైన్లు వస్తాయని చెప్పారు. గత ప్రభుత్వం ఇండ్ల కేటాయింపుల్లో పారదర్శకత అవలంబించలేదని ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. త్వరలోనే జిల్లా కలెక్టర్ తదితర సంబంధిత అధికారులకు ప్రభుత్వం ద్వారా సూచనలు లభిస్తాయని ఆ తర్వాత అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందజేస్తామని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. ప్రతి ఏడాదికి 3,500 ఇండ్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఈ వ్యవహారంలో ప్రభుత్వం విధివిధానాలను రూపొందిస్తుందని ఇదే గనుక జరిగితే నియోజకవర్గం లో ఎవరికి పేదలకు ఇండ్లు లేవని సమస్య ఉండదని అన్నారు. 

రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..

ప్రభుత్వం పేద ప్రజలకు చౌక ధార దుకాణాలలో లబ్ధి పొందే విధంగా ఇతర ప్రభుత్వ సంక్షేమానికి వినియోగించుకుని రేషన్ కార్డులను త్వరలోనే ప్రభుత్వం అందజేయబోతుందని శుభవార్త చెప్పారు. దీనికోసం ప్రజా పాలన సభలలో దరఖాస్తుల స్వీకరించడం జరిగిందని అధికారులు అదే పనిపై ఉన్నారని ప్రభుత్వం కూడా వీటిని ఇచ్చేందుకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో రేషన్ కార్డుల అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు నిరుపేదలను పట్టించుకోలేదని ఒక కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. 

ధరణి పీడ పోతుంది..

ధరణి ప్రవేశంతో రైతుల బ్రతుకులు గుదిబండగా మారాయని దీనిపై అసెంబ్లీలో సమస్యలను వివరించడం జరిగిందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ధరణి స్థానంలో త్వరలోనే ప్రభుత్వం భూమాత ప్రవేశపెడుతుందని అన్నారు. గత ప్రభుత్వం ధరణితో వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసిందని అన్నారు. ధరణిపై సభలో మాట్లాడితే విపక్షాలు కూడా మద్దతు ఇచ్చాయని అన్నారు. ధరణి పేరిట రైతుల సృష్టించిన విధ్వంసం అంత త్వరగా ఎవరు మర్చిపోలేరని అన్నారు. చిన్న పొరపాటుకు కూడా మొత్తం పొలాన్ని ప్రొవైటేడ్ గా పెట్టడం ఎమ్మార్వో ఆర్డీవో స్థాయిలో వాటిని పరిష్కరించే విధానం పెట్టకుండా కలెక్టర్లకు బాధ్యత అప్పగించి అక్రమంగా రైతుల నుండి దండుకున్నారని పేర్కొన్నారు. ధరణితో కుటుంబాలు, వ్యవస్థల మధ్య చిచ్చు రగిలించాయని అన్నారు. ఇప్పుడు ప్రజల మెచ్చిన భూమాత రాబోతుందని అన్నారు. 

పారదర్శకంగా ప్రభుత్వ బదిలీలు

గత ప్రభుత్వం స్వార్ధంగా ఆలోచించి బదిలీలలు ప్రభుత్వ నేతల మార్క్ చూపించిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బదిలీలు పారదర్శకంగా జరిగాయని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. బదిలీలలో ఇష్ట రాజ్యాంగ వ్యవహరించి గందరగోళం సృష్టించాయని ఉద్యోగస్తులు ఎన్నో అపసోపాలు పడ్డారని గుర్తు చేశారు. బదిలీలలో ఏదైనా చిన్న పొరపాటు జరిగిన మళ్లీ వెంటనే వాటిని సరిచేసి పారదర్శకంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఇలాంటి పైరవీలకు ఆస్కారం ఇవ్వకుండా, నిబంధనల ప్రకారం బదిలీలు జరిగాయని సంతృతీయ వ్యక్తం చేశారు. 

కొత్త సభ్యుడిగా ఎంత శతృప్తి పొందా..

మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాక అసెంబ్లీలో రావడం జరిగిందని ఈ మూడవ అసెంబ్లీ సమావేశంలో తాము ముఖ్యమంత్రి మంత్రులు ఇతరుల వద్ద ఎన్నో విషయాలు ఆకలింపు చేసుకున్నామని ఎమ్మెల్యే శంకర్ వివరించారు. కొత్త సభ్యులను కొంత ఎటకారంగా మాట్లాడే ప్రయత్నం ప్రతిపక్షం చేసినప్పటికీ తమ సమస్యల విషయంలో సూటిగా స్పందించామని శంకర్ పేర్కొన్నారు. మా ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు అధికారుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని కలిసికట్టుగా శాసనసభను సభాధ్యక్షుడు నడిపించిన తీరు అద్వితీయమని కొనియాడారు. నూతన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ తదితరులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం శ్వేత స్థాయిలో శ్రమిస్తుంటామని, ప్రజలు కోరిన విధంగా మెచ్చిన రీతిలో ప్రజా పాలన అందించడమే తన ప్రధమ కర్తవ్యం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ తన అభిప్రాయంలో వెల్లడించారు. ధరణిపై గత ప్రభుత్వ నీలి నీడలను చీల్చి చెండాడడం, ప్రతిపక్ష సభ్యులు ఎంత గగ్గోలు పెట్టిన వారిని సస్పెండ్ చేయకుండా ప్రభుత్వ అభివృద్ధి గురించి కూర్చోబెట్టి మరి వినిపించామని అదే వారికి పెద్ద శిక్షగా ఎమ్మెల్యే శంకర్ అభివర్ణించారు.

Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >
Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >
Image 1

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-02 17:42:33

Readmore >