Posted on 2024-07-14 07:09:26
డైలీ భారత్, US News: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన ట్రంప్‌ని ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైంది. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం.
ట్రంప్ ప్రచారం నిర్వహిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజిపై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. మాజీ అధ్యక్షుడిని వేదికపై నుంచి దించి ఆస్పత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
దాడిని తీవ్రంగా ఖండించిన బైడెన్
ట్రంప్‌పై దాడిని అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదని పేర్కొన్నారు.
ట్రంప్ త్వరగా కోలుకోవాలి: కమలా హారిస్
ట్రంప్‌పై కాల్పుల ఘటనను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఖండించారు. అమెరికాలో హింసకు తావు లేదన్నారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో తక్షణం స్పందించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్, లోకల్ అథారిటీస్‌ను ఆమె అభినందించారు.
పెన్సిల్వేనియా బట్లర్‌లో ట్రంప్‌పై దాడి జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన సీక్రెట్ సర్వీస్.
ఆ ప్రాంతంలోని బిల్డింగ్‌లను తమ ఆదీనంలోకి తీసుకున్న బలగాలు.
కాల్పుల ఘటనలో ట్రంప్ కుడి చెవి భాగంలో గాయం.
ట్రంప్‌పై దాడి జరిపిన దుండగుడిని కాల్చి చంపిన బలగాలు.
#Donald Trump #us news #trump
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >