| Daily భారత్
Logo




నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

News

Posted on 2026-04-28 22:32:22

Share: Share


నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

నిజాలను రాస్తే.. నీలాప నిందలా..!

 ఫోర్త్ ఎస్టేట్ పై పగబట్టి.. పథకం ప్రకారం కుట్రలు..

ఖాకీలను సైతం తప్పుదారి పట్టించిన వైనం..

హంతకుడే సంతాప సభ పెట్టిన వైనం

తోటి కలం కార్మికులపైనే కక్షలు..

రాష్ట్రంలోనే ఎక్కడా లేని విచిత్రం..

సిరిసిల్లలో జర్నలిస్టు ముసుగులో అరాచకాలు..

డైలీ భారత్, సిరిసిల్ల: సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన నాలుగో స్తంభానికి అవమానాలు తప్పడం లేదు.. నిజాలను రాసి.. అక్రమాలను వెలికితీస్తున్న పాపానికి నీలాప నిందలు మోస్తున్న పరిస్థితి నెలకొంది.. పోలీసులను తప్పుదారి పట్టించి.. మరీ సొసైటీలో ఫోర్త్ ఎస్టేట్ గా పేరుపొందిన కలం కార్మికులపై తోటి సహచరులే పథకం ప్రకారం కుట్రలు పన్ని కేసుల పాలు చేసిన వైనమిది.. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విచిత్రమైన పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిపిస్తుంది. జర్నలిస్టు ముసుగులో.. చలా మని అవుతూ.. తమ అక్రమాలకు అడ్డువస్తున్నారని తోటి జర్నలిస్టులపైనే కేసులు పెట్టించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా మారింది. కలానికి కలంకం తెచ్చి.. తోటి కలం కార్మికుల బతుకుల్లో నిప్పులు పోసి.. జర్నలిస్ట్ సంఘాల నాయకులే ఊరేగుతున్న పరిస్థితి సిరిసిల్లలో నెలకొంది. చివరకు హంతకుడే సంతాప సభ నిర్వహించిన చందంలో విలేకరులను పోగు చేసుకుని హక్కుల కోసం పోరాటం అంటూ.. నక్క వినయాలు ప్రదర్శించడం దిగజారుడు నైజానికి అద్దం పడుతుంది. 

ప్రజలారా.. మిత్రులారా ఇది సంజాయిషీ కాదు..

ఇది ఏ మాత్రం సంజాయిషీ కోసం కాదు.. ఇంతకాలం ప్రజా సమస్యలపై.. ప్రజల ఇబ్బందులపై.. సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడిన పాపానికి వివరణ ఇచ్చుకునే పరిస్థితి వస్తుందని అనుకోలేదు.. ఇది కేవలం ప్రజలకు నిజాలు తెలియాలన్న ఉద్దేశంతోనే మీతో తెర వెనుక సమాజాన్ని తప్పు దారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటూ.. జర్నలిస్ట్ సంఘాల నాయకులుగా చెలమణి అవుతూ.. ఫోర్త్ ఎస్టేట్ కు చెదలు పట్టించిన మనుషుల గురించి సాటి జర్నలిస్టు సహచరుల బతుకుల్లో నిప్పులు పోసిన అసలు ముఖాల గురించి మీతో పంచుకునేందుకు మరోసారి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది.. 

పక్కదారి పట్టించిన.. పెద్ద మనిషి గురించి..

ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విలేకరుల బరితెగింపు.. అంటూ ఓ కథనాన్ని ప్రచారంలో పెట్టిన పెద్ద మనిషి గురించి చెప్పుకోవాల్సి సందర్భం. తన ఈగో  కోసం అయిదుగురు విలేకరుల గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేసి వ్యూహాత్మకంగా నిందలు మోపి ఆ పాత్రికేయుల కుటుంబాలను తీవ్ర మానసిక క్షోభ గురిచేసిన వైనం గురించి ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది. తనకు వత్తాసు పలకని పాత్రికేయులను, నిజాలను నిర్భయంగా రాయగలిగి విలేకరులు తీవ్రంగా అవమానాలు పాలు చేయాలని ఉద్దేశంతోనే సాక్షాత్తు ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా చలామణిలో ఉన్న నేత ఒకరు ప్రజలను పోలీసులను సాటి పాత్రికేయులను సైతం పక్క దారి పట్టించిన దురదృష్టకర పరిణామాలు సాటి సహచర పాత్రికేయుల బతుకుల్లో నిప్పులు పోసిన నిజాలను ప్రజలు తెలుసుకోవాల్సిందే.. తోటి సహచరులను అడ్డంగా ఇరికించినట్లు లోలోపుల సంబరపడుతూనే.. పైకి మాత్రం ఏమీ ఎరగనట్టు నంగనాచిల అక్రమ కేసులు అంటూ.. జర్నలిస్టుల హక్కుల పేరుతో యూనియన్ నాయకుడిగా ముందున్నట్లు నటిస్తూ.. హంతకుడే సంతాప సభ జరిపించినట్లుగా వ్యవహరించడం సిరిసిల్ల ప్రజానికం ముక్కున వేలేసుకుంటుంది. 

నిరాదరమైన ఆరోపణలు వెనుక..

ఇంకా తెల్లారక ముందే చుట్టూ ముట్టిన పోలీసులు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఆకస్మిక తనిఖీ. పరిస్థితి అర్థం కాకముందే పోలీసుల వాహనంలో తరలింపు. భయంలో కుటుంబ సభ్యులు. ఇదేదో టెర్రరిస్టును పట్టుకోవడానికో అనుకుంటే మీరు భ్రమ పడినట్టే.  నిజాలను నిర్భయంగా రాసిన పాత్రికేయుడు చెల్లించిన మూల్యం. కుటుంబం పడిన క్షోభ నుంచి పాత్రికేయుడి పడిన ఆవేదన నుంచి ఈ మాటలు చెప్పాల్సి రావడం బాధగానే ఉంది. విచారణ లేదు నిజాల్ని నిగ్గు తేల్చింది లేదు. ఇటీవల కొంతమంది పాత్రికేయులపై తప్పుడు కేసులు మోపిన పరిస్థితులు గమనించి ఉన్నాం.

మరోసారి నిజాలను బహిర్గత పరిచేందుకే..

గతంలో పాత్రికేయులపై జరుగుతున్న కుట్రలపై బహిరంగ లేక రాశాను. మరోసారి నిజాలను నిర్ధారణ చేసుకున్నాక మళ్లీ మీతో కొన్ని విషయాలు పంచుకుంటున్నాను. ఏండ్ల తరబడి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వాళ్లకు నిజ నిజాలతో పనిలేదు. ఏవైనా ఆరోపణలు వస్తే చాలు.. పీకి అవతల పారేస్తారు.. ఇది ఇవాళ ఫోర్త్ ఎస్టేట్లో చలామణిలో ఉన్న పద్ధతి. ఈ పద్ధతి ఎంతోమంది నిజాయితీ పరుల జీవితాలను నిలువునా కూల్చివేయడమే కాకుండా ఫోర్త్ ఎస్టేట్ కు చెద పురుగుల తయారైంది. గతంలో ఏకంగా జిల్లా పోలీసు అధికారుల పేరు చెప్పి వసూళ్లకు పాల్పడిన "జనశక్తి" నకిలీ ప్లీనరీ సూత్రధారి ప్రస్తుతం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా చలామణి అవుతున్న ఆకులు జయంత్ కుమార్ గురించి తెలిసిందే. ఇప్పుడు అతను సమాజంలో పెద్ద మనుషుల చెలామని అవుతున్న బుద్ధులు మాత్రం యధావిధిగా పాతవే కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. కొందరు పెద్దల మెప్పుకోసం పకడ్బందీగా ఓ డాక్టర్ చేత వసూళ్ల కేసు పెట్టించి ప్రయత్నం చేశాడు. అన్ని తెలిసిన ఎందుకో సహచర మీడియా మిత్రులు గొంతు విప్పకపోవడం బాధాకరం. కనీసం పాత్రికేయులపై అక్రమంగా తన చేత కేసు పెట్టించిన విషయాన్ని డాక్టర్ స్వయంగా చెప్పడంతో పాటు మీడియాలో జరుగుతున్న కుట్రలను సైతం విప్పి చెప్పారు. ఆధారాలన్నీ ఈ పోస్ట్ తోపాటు పెడుతున్నా. ప్రజలారా గమనించండి. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి, పెద్దమనుషుల ముసుగులను చలామణి అవుతున్న వాళ్లపై దృష్టి సారించండి నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిజాలని నిగ్గు తేల్చండి.. చివరగా ప్రతిక్షణం ప్రజా సమస్యలపై పోరాటం.. అవినీతి అధికారులు, ప్రజా ప్రతినిధులపై వరుస కథనాలు.. తెల్లవారితే ఎవరి అక్రమాలపై కథనం వస్తుందో అని ఆత్రుత నింపిన విషయం సిరిసిల్ల ప్రజానీకానికి చెప్పనవసరం లేదు. ఇలాంటి ఎన్నో కోకొల్లలుగా అందించిన కథనాలతో ఉత్తమ జర్నలిస్టుగా జిల్లా పాలన అధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్న విషయం తెలిసిందే.. ఇవన్నీ కల్లప్పగిచ్చి చూసిన సదరు పెద్దమనిషి ఓరువలేని తనంతో నాతో పాటు తోటి సహచరులను పక్కా పథకం ప్రకారం ఇరికించడం జరిగింది.. ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి పత్రికా రంగంలో రాణించిన తక్కువ మందిలో నేను ఒకడిగా ఉన్నాను..నాకు వస్తున్న ఆదరణతోనే.. నా పేరును బదనం చేయడంతో పాటు నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకే పన్నిన కుట్రలో భాగంగా నమ్ముతున్న.. సదా సిరిసిల్ల  ప్రజలకు మద్దతుగానే ఉంటారని  ఆశిస్తున్నకటకం సంతోష్ కుమార్..

సీనియర్ జర్నలిస్ట్

Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >