డైలీ భారత్, సుజాతనగర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్ గ్రామానికి చెందినకాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PD) పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ (55) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.
పాఠశాల విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా డేగలమడుగు ఆంజనేయ స్వామి గుడి వద్ద సడన్‌గా ఈరోజు సాయంత్రం నాలుగు 30 గంటల సమయంలో గుండెనొప్పి వచ్చి కిందపడిపోయారు. వెనుక ఆటోలో వస్తున్న తోటి ఉపాధ్యాయురాలు కళ్యాణి, బంధువు కృష్ణలు గమనించి CPR చేసి, 108 అంబులెన్స్‌లో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
ఈ ఘటనపై మృతుని సోదరుడు చింతలపూడి రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుజాతనగర్ ఎస్సై మాలోత్ రమాదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.