| Daily భారత్
Logo




మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

News

Posted on 2026-04-28 19:04:17

Share: Share


మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణ పరిధిలో వివిధ సందర్భాల్లో గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో  కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తగూడెం టౌన్ తో పాటు చుంచుపల్లి లక్ష్మీదేవి పల్లి పోలీస్ స్టేషన్ లో పలు సందర్భాల్లో గంజాయి సేవిస్తూ పట్టుబడి కేసులను నమోదు అయిన యువకులను పిలిపించి వారి తల్లిదండ్రుల సమక్షంలో ఈ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని డిఎస్పి నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై యువకులు తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచిగా చదువుకొని తమ తల్లిదండ్రులకు,తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  సారధ్యంలో ఇకపై కొత్తగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో నిరంతరం గస్తీని పెంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఎవరైనా అక్రమంగా గంజాయి సరఫరా చేస్తునట్లు గానీ,సేవిస్తున్నట్లు గానీ సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోపంగా ఉంచుతామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టూ టౌన్ సిఐ ప్రతాప్, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు,వన్ టౌన్ సిఐ కరుణాకర్,త్రీటౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి,ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

స్నేహ సుగంధం---మంజుల పత్తిపాటి

Posted On 2026-07-29 05:09:34

Readmore >
Image 1

విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్

Posted On 2026-07-29 04:49:54

Readmore >
Image 1

రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్

Posted On 2026-07-29 04:48:42

Readmore >
Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

Posted On 2026-07-28 17:20:49

Readmore >
Image 1

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపూడి యుగంధర్ మృతి

Posted On 2026-07-28 17:11:57

Readmore >
Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >