Posted on 2026-07-28 17:22:38
జనగామ జిల్లాలో ఘటన ఇద్దరు అరెస్ట్
డైలీ భారత్ డెస్క్: మూడో సారీ ఆడపిల్లే అని తేలడంతో అబార్షన్ చేసుకున్న మహిళ తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. మహిళ మృతికి కారణమైన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన భాస్కర్ గౌడ్ కు దేవరుప్పుల మండలం కొలుకొండ గ్రామానికి చెందిన శ్రావణి (35)తో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. భాస్కర్ గౌడ్ హైదరాబాద్ లో ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు.శ్రావణి మూడోసారి గర్భం దాల్చడంతో కొన్ని రోజులుగా తల్లిగారింట్లో ఉంటోంది. ఇటీవల శ్రావణి, ఆమె తల్లి శోభ హనుమకొండలోని ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ నిర్వాహకుడు ప్రవీణ్ దగ్గరకు వెళ్లగా.. అతడు శ్రావణిని పరీక్షించి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని చెప్పాడు. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. మళ్లీ అమ్మాయి అని తేలడంతో అబార్షన్ చేయించాలని నిర్ణయించారు. దీంతో కోలుకొండకు చెందిన ఆర్ఎంపీ రచ్చ శ్రావణ్ కుమార్ సహకారంతో జనగామలోని సంజయ్ నగర్ కు చెందిన ప్రైవేట్ ఏఎన్ఎం అనసూయను కలిశారు.ఆమె ఈ నెల 21న తన ఇంట్లోనే శ్రావణికి అబార్షన్ చేసింది. తర్వాతి తోరు శ్రావణికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ శనివారం తెల్లవారుజామున శ్రావణి చనిపోయింది. భర్త భాస్కర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏఎన్ఎం అనసూయ, ఆర్ఎంపీ రచ్చ శ్రావణ్ కుమార్ ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అబార్షన్ కు ప్రోత్సహించిన మృతురాలి తల్లి శోభ, స్కానింగ్ చేసిన డయగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నారని జనగామ సీఐ సత్యానారాయణ రెడ్డి తెలిపారు.
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >