| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా; తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం అయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఎల్లుండి పదవీ విరమణ చేయగా.. ఆ తర్వాత సీవీ ఆనంద్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్ ఇప్పటివరకు పలు హోదాల్లో పనిచేశారు.అంతా అనుకున్నట్లుగానే తెలంగాణ డీజీపీ పదవి సీవీ ఆనంద్‌కు దక్కింది. తెలంగాణ తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీవీ ఆనంద్‌ను నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెలాఖరున ప్రస్తుత డీజీపీ శివధర్‌‌రెడ్డి ఉద్యోగ విరమణ చేయనుండగా.. ఆ తర్వాత ఆ స్థానంలోకి ఎవరు వస్తారా.. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కొత్త డీజీపీగా నియమిస్తుంది అనేది గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. తాజాగా ఆ ఉత్కంఠకు తెరపడింది. కొత్త పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు.. కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమిస్తున్నట్లు మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్ .. సీనియారిటీ పరంగా చూస్తే.. డీజీపీ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్‌కు క్షేత్రస్థాయిలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన అనుభవం ఉంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వహణలో సీవీ ఆనంద్‌కు ఉన్న పట్టు, ఆయన ఇమేజ్‌ను సహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయనకు డీజీపీ బాధ్యతలు కట్టబెట్టింది.గతంలో హైదరాబాద్‌ సీపీగా, ఏసీబీ డైరెక్టర్‌గా సీవీ ఆనంద్ ఎన్నో విజయాలు అందుకున్నారు. సీవీ ఆనంద్ పనితీరుపై సంతృప్తిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర శాంతి భద్రతల బాధ్యతలను అప్పగించడం ద్వారా పోలీస్ శాఖలో మరింత క్రమశిక్షణను పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్‌ ‌రెడ్డి త్వరలోనే పదవీ విరమణ పొందనున్నారు. ఈ నెలాఖరున డీజీపీ శివధర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఈనెల 30వ తేదీన డీజీపీగా శివధర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆ తర్వాతి రోజే అంటే మే 1వ తేదీన కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు తీసుకోనున్నారు.

Previous జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు
Next నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..
ADVERTISEMENT