Posted on 2026-04-28 06:42:26
ఆర్.టి.ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగల రవీందర్.
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా ( భిక్నూర్ ) : జిల్లా పంచాయతీ అధికారిపై (డిపిఓ) సోమవారం ప్రజా వాణిలో సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగల రవీందర్ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఈమెరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ... ఎస్వీ గార్డెన్ ఫంక్షన్ హాల్ అక్రమ అనుమతులు మరియు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ వంటి అంశాలపై డిసెంబర్ 31 నుండి నేటి వరకు లికిత పూర్వకంగా ఫిర్యాదు చేసి నాలుగు నెలలు గడిచిన సంబంధిత జిల్లా పంచాయతీ అధికారి స్పందించకపోవడంతో నేరుగా ప్రజావాణిలో డిపిఓ మురళి కృష్ణ పై ఫిర్యాదు చేయడం జరిగింది. సుమారు 8సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పట్టించుకోలేరు తూతూ మంత్రంగా విచారణ చేసి చేతులు దులుపుకుందామనే ఆలోచనలో ఉన్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. తక్షణమే ఎస్వీ గార్డెన్ ఫంక్షన్ హాల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజావాణిలో సమస్య పరిష్కారం కానందున జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారుల పై హైదరాబాదులోని చీఫ్ సెక్రటరీ కార్యాలయంతో పాటు లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తానని ఈ సందర్భంగా సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగల రవీందర్ ముదిరాజ్ తెలిపారు.
విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్
Posted On 2026-07-29 04:49:54
Readmore >
రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్
Posted On 2026-07-29 04:48:42
Readmore >
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >