డైలీ భారత్, బిబిపేట: అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని బిబిపేటలో బతుకమ్మ సంబురాలు అంబరాన్ని తాకాయి. తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ ముదిరాజ్ ఆధ్వర్యంలో కాలనీవాసులతో కలిసి ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ముదిరాజ్ వాడలోని మేరీ స్కూల్ వద్ద, కొరివి నీరజ ఇంటి వద్ద ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో" అంటూ రంగురంగుల బతుకమ్మలతో ఆటపాటలు ఆడుతూ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతి ఏటా సంప్రదాయంగా వస్తున్న ఈ పండుగను తొమ్మిది రోజుల నవరాత్రుల సందర్భంగా ఆడపడుచులతో కలిసి వైభవంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ తెలిపారు.