Posted on 2026-04-28 04:28:08
బైక్ తాళం విషయంలో మొదలైన గొడవ విషాదాంతం
రాళ్లతో కొట్టి స్నేహితుడిని చంపేసిన స్నేహితులు
నిందితులు గౌస్, కార్తీక్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
డైలీ భారత్, తాడిపత్రి : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తాడిపత్రి పట్టణంలోని బంకమట్టి కాలనీకి చెందిన దూదేకుల అబ్దుల్లా, గౌస్, కార్తీక్‌లు స్నేహితులు. ఆదివారం రాత్రి అబ్దుల్లాకు చెందిన బైక్ తాళాన్ని స్నేహితులు కింద పడేశారు. ఈ విషయమై వారి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన గౌస్, కార్తీక్‌లు.. పక్కనే ఉన్న పదునైన నాపరాళ్లతో అబ్దుల్లా తల, ఇతర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన అబ్దుల్లా, అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడిపత్రి పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన గౌస్, కార్తీక్‌లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో బంకమట్టి కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి
విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్
Posted On 2026-07-29 04:49:54
Readmore >
రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్
Posted On 2026-07-29 04:48:42
Readmore >
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >