Posted on 2026-04-28 19:21:46
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు టు తిరుపతికి షిరిడీకి ప్రత్యేక రైలు నడపాలిమణుగూరు టు డోర్నకల్ కాజీపేట ప్యాసింజర్ రైలును తిరిగి నడపాలికొల్హాపూర్ బెల్గావి ఎక్స్ప్రెస్ ట్రైన్ ను కొనసాగించాలిసౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ డి ఆర్ యు సి సి మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ సికింద్రాబాద్ రైల్వే సంచలన్ భవన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ డి ఆర్ యు సి సి మెంబర్స్ సమావేశం చాలా హాట్ హాట్ గా నడిచిందిఈ సమావేశానికి హాజరైన డిఆర్ యు సి సి మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి చర్చల్లో పాల్గొని మాట్లాడుతూ.. కొత్తగూడెం నుండి తిరుపతికి ప్రత్యేక రైలు నలుపుతామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని ఎప్పుడు ఈ రైలు నడుపుతారని అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారుకాజీపేట డోర్నకల్ టు మణుగూరు వరకు గతంలో నడిపిన ప్యాసింజర్ రైలును, కొలహపూర్ బెల్గావి ఎక్స్ప్రెస్ ను ఎందుకు ఆపారని ఈ ట్రైన్స్ ను తక్షణమే నడపాలని డిమాండ్ చేశారుకొత్తగూడెం రైల్వే స్టేషన్ పనులు గత నాలుగు సంవత్సరాలుగా నత్త నడక నడుస్తున్నాయని ప్రజలు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మరోసారి విజ్ఞప్తి చేశారుకొత్తగూడెం నడిబొడ్డున రాజీవ్ పార్కు ప్రగతి మైదానం ఎన్జీవోస్ కాలనీ మధ్యలో గత అనేక సంవత్సరాలుగా ఉన్న రైల్వే ట్రాక్ దారిని మూసివేసారని దీనివలన ప్రజలు,వాకర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ఈ దారిని తిరిగి ఓపెన్ చేయాలనిగట్టిగా అధికారులకు విన్నవించారుకొత్తగూడెం రైల్వేస్టేషన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ ఫామ్ వన్ కు రాకుండా రెండవ ప్లాట్ ఫామ్ మీద ఆపుతున్నారని దీనివలన ప్రయాణికులు వృద్ధులు మహిళలు దివ్యాంగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తిరిగిసూపర్ ఫాస్ట్ ట్రైన్ నెంబర్ వన్ ప్లాట్ ఫామ్ మీదకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరారుకొత్తగూడెం రైల్వే స్టేషన్ సెంటర్ నుండి త్రీ టౌన్ గొల్లగూడెం సెంటర్ వరకు రహదారి వెడల్పుకు గౌరవపార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురాం రెడ్డి అభ్యర్థన మేరకు స్థలం తక్షణం ఏర్పాటు చేసి రహదారి వెడల్పుకు క్లియరెన్స్ ఇవ్వాలని కోరారుఈ సందర్భంగా రైల్వే సమస్యలపై వినతి పత్రాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాల కృష్ణన్ శ్రీనివాస్ రెడ్డి అందించడం జరిగిందిదీంతో అధికారులు స్పందిస్తూ సమస్యలను ఒక దాని వెంట ఒకటి సావధానంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారుసమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు డి ఆర్ యు సి సి మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు
విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్
Posted On 2026-07-29 04:49:54
Readmore >
రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్
Posted On 2026-07-29 04:48:42
Readmore >
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >