Posted on 2026-04-28 19:39:39
డైలీ భారత్ డెస్క్: సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు.. డబ్బుల విత్అకు డెత్ సర్టిఫికెట్ అడగడంతో..ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ హృదయ విదారక ఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. నిబంధనల పేరుతో బ్యాంకులు సామాన్యులను ఎంతటి వేదనకు గురిచేస్తాయో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం.కియోంజర్ జిల్లా డియానాలి గ్రామానికి చెందిన జితు ముండా అనే వ్యక్తి, తన సోదరి కాక్రా ముండా అకౌంట్లో ఉన్న రూ. 19,300 డ్రా చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డాడు. కాక్రా ముండా రెండు నెలల క్రితమే మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం అంతకుముందే మరణించడంతో, జితు ఒక్కడే ఆమెకు మిగిలి ఉన్న ఏకైక బంధువు. తన సోదరి అంత్యక్రియలు, ఇతర ఖర్చుల కోసం ఆ డబ్బు అవసరమవ్వడంతో అతను ఒడిశా గ్రామీణ్ బ్యాంక్ను ఆశ్రయించాడు.అయితే, బ్యాంకు మేనేజర్ నిబంధనల పేరుతో డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. ఖాతాదారు స్వయంగా రావాలని లేదా వారసుడిగా ధృవీకరించే చట్టపరమైన పత్రాలు సమర్పించాలని ఖరాకండిగా చెప్పారు. చదువుకోని గిరిజనుడైన జితు వద్ద మరణ ధృవీకరణ పత్రం గానీ, వారసత్వ పత్రాలు గానీ లేవు. ఆ క్లిష్టమైన ప్రక్రియ అర్థం కాక నిస్సహాయ స్థితిలో వెనుతిరిగిన జితు, సోమవారం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. స్మశానానికి వెళ్లి తన సోదరి అస్థిపంజరాన్ని తవ్వి తీసి, దానిని ఒక గుడ్డలో చుట్టి భుజాన వేసుకుని, మండుటెండలో 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు.బ్యాంకు వద్ద ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు నివ్వేరపోయారు. నిబంధనల కంటే మానవత్వం ముఖ్యం కాదా అని బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సర్పంచ్ ద్వారా ధృవీకరించుకోవడమో లేదా క్షేత్రస్థాయి పరిశీలన చేయడమో చేయకుండా, ఒక పేదవాడిని ఇలా ఇబ్బంది పెట్టడంపై నిరసన వ్యక్తమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జితును ఓదార్చారు. ఈ విషయాన్ని మానవతా దృక్పథంతో పరిష్కరిస్తామని, బ్యాంకు నుండి వివరణ కోరుతామని పోలీసులు హామీ ఇచ్చారు.
విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్
Posted On 2026-07-29 04:49:54
Readmore >
రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్
Posted On 2026-07-29 04:48:42
Readmore >
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >