Posted on 2024-07-12 10:45:15
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాంబాబు పండంటి కాపురంలో చిచ్చు పెట్టాడు. ఓ కేసు విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతూ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన కుటుంబానికి సాయం చేస్తున్నట్లు నమ్మించి ఇల్లాలిపై కన్నేశాడు.
చెల్లీ అంటూ వరుస కలిపి మాయమాటలతో దగ్గరై చివరికి అనుకున్నంత పనిచేశాడు.
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో బాంబ్ స్క్వాడ్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు రాంబాబు. అయితే ఓకేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన త్రివేణితో సన్నిహితంగా మెదులుతూ స్నేహం పెంచుకున్నాడు.
అనంతరం వెస్టీజ్ మార్కెటింగ్ లో చేరితే ఆర్థిక సమస్యలు తీరుతాయని పలుమార్లు త్రివేణిని తనవెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే త్రివేణిని శారీరకంగ లొంగదీసుకుని కోరికలు తీర్చుకున్నాడు.
అయితే కొద్ది రోజులకు త్రివేణి, రాంబాబుల వ్యవహారంలో అనుమానం వచ్చిన త్రివేణి భర్త నాగేంద్రబాబు.. ఒకరోజు వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు.అయితే నాగేంద్రబాబుపై దాడి చేసేందుకు రాంబాబు, త్రివేణిలు ప్రయత్నించారు.
అయితే వారినుంచి తప్పించుకున్న నాగేంద్రబాబు కానిస్టేబుల్ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ ను కలిసి వేడుకున్నాడు.
త్రివేణి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలను అధికారులకు చూపించాడు. దీంతో కానిస్టేబుల్ రాంబాబుతోపాటు త్రివేణిపై ఖానాపురం పోలీసులు కేసునమోదు చేశారు.
పదిసంవత్సరాల క్రితం త్రివేణిని ప్రేమించి కూలాంతర వివాహం చేసుకున్న నాగేంద్రబాబు దంపతులకు ఇద్ధరు కుమారులున్నారు. అయితే ఈ దారుణానికి పాల్పడిన కానిస్టేబుల్ రాంబాబుపై కఠిన చర్యలు తీసుకొని, విధుల నుంచి సస్పెండ్ చేయాలని బాధితుడి తరఫు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >