| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేడు ఉమ్మడి జిల్లాలో మాజీ సిఎం పర్యటన

నేడు ఉమ్మడి జిల్లాలో మాజీ సిఎం పర్యటన

కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఎండిన పొలాలను పరిశీలించనున్న కెసిఆర్

సిరిసిల్లలో కీలక ప్రకటన చేసే అవకాశం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : కష్టాల్లో ఉన్న తెలంగాణ రైతులకు అండగా నిలవడానికి చేపట్టిన పొలం బాట కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు, శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా శుక్రవారం ఉదయం 11:00 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుమ్ పూర్ గ్రామంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి కష్టాలను తెలుసుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:00 గంటలకు బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పొలాలను పరిశిలించి, నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. సాయంత్రం 3:00 గంటలకు శాభాష్ పల్లి బ్రీడ్జి వద్ద మధ్యమానేరు(రాజరాజేశ్వర జలాశయం) ప్రాజెక్టును పరిశీలిస్తారు. తదానంతరం…

సాయంత్రం 4:00గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో కెసిఆర్ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Previous చేవెళ్ళలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు భారీ షాక్
Next తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూత
ADVERTISEMENT