Posted on 2024-04-04 20:05:22
సీఎం రేవంత్ సమక్షం... ఎంపీ రంజిత్ రెడ్డి నేతృత్వంలో ముఖ్యనేతలు కాంగ్రెస్లో చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
చేవెళ్ళ పార్లమెంట్ హస్తం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని స్పష్టీకరణ
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. స్థానిక ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చేరారు. గురువారం హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వారందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేవెళ్ల ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా ఎంపీ రంజిత్ రెడ్డితో కలసి పని చేసేందుకు పార్టీలో చేరినట్టు వారంతా స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వెల్లడించారు.
మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ మాజీ జేడ్పీటీసీ జిల్లెల నరేందర్ రెడ్డి, కందుకూరు జేడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సిద్దాల దశరథ, రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు బచ్చనబోయిన నరసింహ యాదవ్, కార్పొరేటర్ బచ్చన బోయిన పద్మ, రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, అనిత నాయక్, తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవానీ వెంకట్ రెడ్డి, జల్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఇక్బాల్ బిన్ ఖలీఫా, జల్పల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ యూసుఫ్ పటేల్, కౌన్సిలర్ తేజిస్వీని శ్రీకాంత్, కొండల్ యాదవ్, కౌన్సిలర్ అవల్గీ, మీర్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాజీ జేడ్పీటీసీ జిల్లెల్ల నరేందర్ రెడ్డి, జిల్లాలగూడ మాజీ సర్పంచ్ జిల్లెల్ల వనిత నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు చల్వది రాజేష్, దేరంగులు యాదయ్య, బొబ్బిలి కిరణ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొబ్బిలి విజయ్ గౌడ్, భీమ్ రాజ్ శంకర్, శ్రీ కాంత్, బద్దం అనిల్ గౌడ్, గ్యార అనిల్ కుమార్, తదితరులు కండువా కప్పుకున్నారు.
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శంకర్ పల్లి జడ్పీటీసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి మునిసిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, కౌన్సెలర్ లు లక్ష్మమ్మ రాంరెడ్డి,శ్వేతా పాండురంగారెడ్డి, చంద్రమౌళి, అశోక్, శ్రీనాథ్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు రజిని శ్రీనివాస్, మహమూద్,నాయకులు బాలకృష్ణ రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, రఘునందన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-09 19:45:58
Readmore >
మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్
Posted On 2026-03-09 19:22:17
Readmore >
కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి
Posted On 2026-03-09 19:20:29
Readmore >
ఐటిడిఏ కాంప్లెక్స్ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి
Posted On 2026-03-09 19:19:18
Readmore >
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
Posted On 2026-03-09 19:17:48
Readmore >
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ర్యాలీ
Posted On 2026-03-09 19:09:41
Readmore >