Posted on 2026-03-09 15:55:04
డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి LSRW (Listening, Speaking, Reading, Writing) అంశంపై విస్తరణ ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి వాగ్దేవి డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగ ఉపన్యాసకులు బి. రాజు ముఖ్య వక్తగా పాల్గొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ యెలగొండ అంజనేయులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్, డిపార్ట్మెంట్ ఇంచార్జీ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా బి. రాజు మాట్లాడుతూ ఆంగ్ల భాషను సమర్థవంతంగా నేర్చుకోవడానికి Listening, Speaking, Reading, Writing అనే నాలుగు ప్రధాన నైపుణ్యాలు ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ చదవడం, వినడం, మాట్లాడడం మరియు రాయడం వంటి అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా ఆంగ్ల భాషపై పట్టు సాధించవచ్చని సూచించారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలను పొందడానికి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. డాక్టర్ యెలగొండ . అంజనేయులు కూడా విద్యార్థులు భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఆంగ్ల అధ్యాపకురాలు డి. రమ్య, వాణి, డాక్టర్ శ్రవణ్ కుమార్, ఆది విష్ణు, మనోహర్, శ్రీనివాస్, సుచరణ్, భిక్షమయ్య, దీపిక, జగనాథం అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >