Posted on 2026-03-08 14:33:12
ముగ్గురు చిన్నారులను చెరువులో నెట్టి చంపిన కిరాతకుడు.
కామారెడ్డి పోలీసుల వేగవంతమైన దర్యాప్తులో వీడిన మిస్టరీ
నిందితుడిపై కఠిన చర్యలు - చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని ఎస్పీ.
కామారెడ్డి ఏఎస్పి బి చైతన్య రెడ్డి ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కన్నతండ్రే కాలయముడై తన ముగ్గురు పసిపిల్లలను కడతేర్చిన ఈ ఘటన మన సమాజానికే ఒక మాయని మచ్చ. ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికం, కానీ మనం తీసుకునే ఆవేశపూరిత నిర్ణయాలు తీరని శోకాన్ని మిగిల్చుతాయి. ఏ తండ్రీ తన బిడ్డల ప్రాణం తీసే స్థాయికి వెళ్ళకూడదు. మీకు ఏ కష్టం వచ్చినా, మనసు భారమైనా.. దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి; సమస్యను పంచుకోవడానికి మీ పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ పసి మొగ్గలు వికసించకముందే రాలిపోవడం మనందరికీ తీరని ఆవేదన. దయచేసి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి, తోటివారికి అండగా నిలుద్దాం. ఇలాంటి విషాదం మరే ఇంట్లోనూ జరగకూడదు."
ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని, నిందితుడికి గరిష్ట శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. నేరం చేసిన వారు ఎవరైనా సరే, చట్టం నుండి తప్పించుకోలేరని మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు
కామారెడ్డి పట్టణంలోని ఆర్.బి. నగర్ కాలనీకి చెందిన ఇస్మాయిల్ రాజ్ షేక్ భార్య షబీన బేగమ్, తన ముగ్గురు కుమార్తెలు (సిఫత్, అయ్యద్, మరియమ్) మార్చి 6వ తేదీ ఉదయం 11 గంటల నుండి కనిపించడం లేదని కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసుగా నమోదు చేసిన పోలీసులు, పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు ఒకేసారి మాయం కావడంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఈ ఘటన తీవ్రతను గుర్తించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ ఆదేశాల మేరకు, ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ప్రత్యక్ష పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు విచారణను వేగవంతం చేశాయి. సాంకేతిక ఆధారాలు మరియు స్థానిక విచారణలో భాగంగా పోలీసులు అన్ని కోణాల్లో గాలించారు. ఈ క్రమంలో పిల్లల తండ్రి ఇస్మాయిల్ రాజ్ షేక్ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలగడంతో, అతడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారించగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన ఇస్మాయిల్ రాజ్ షేక్, తనకున్న చెడు అలవాట్ల వల్ల వచ్చిన ఆదాయాన్ని వృథా చేస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. కుటుంబ పోషణ భారం కావడంతో పాటు, ముగ్గురు కుమార్తెల వల్ల ఖర్చులు పెరుగుతున్నాయని అతడు భావించాడు. ఈ మానసిక ఒత్తిడి మరియు తప్పుడు ఆలోచనలతో, తన సొంత రక్తమని కూడా చూడకుండా కన్నకూతుళ్లను హతమార్చాలని ముందే పథకం రచించాడు.
వివరలోకెళ్తే...
పథకం ప్రకారం, ఘటన తేదీ 06.03.2026 నాడు ఉదయం 11.00 గంటలకు తన ముగ్గురు కుమార్తెలకు స్నాక్స్ కొనిస్తానని మాయమాటలు చెప్పి తన ఆటోలో కామారెడ్డిలోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొంతసేపు పిల్లలతో కలిసి సమయం గడిపినట్లు నటించి, ఎవరూ లేని సమయం చూసి ఒక్కొక్కరిగా ముగ్గురు పిల్లలను (8, 6 మరియు 5 ఏళ్ల వయస్సు గలవారు) వరుసగా చెరువు నీటిలోకి నెట్టివేశాడు. వారు కళ్ల ముందే ప్రాణ భయంతో కొట్టుకుంటున్నా కనికరం లేకుండా చూస్తూ ఉండి, వారు నీటిలో మునిగిపోయిన తర్వాత అక్కడి నుండి పరారయ్యాడు.
పిల్లలను హత్య చేసిన తర్వాత ఇంటికి వెళ్లి ఏమీ తెలియనట్లుగా నటించిన నిందితుడు, పోలీసుల విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పి దొరికిపోయాడు. చివరకు తన నేరాన్ని అంగీకరిస్తూ, పిల్లల ఆధార్ కార్డులను కూడా సాక్ష్యం దొరక్కుండా చెరువు వద్ద రాళ్ల మధ్య పడేసినట్లు తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కామారెడ్డి పోలీసులు, హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
వివరాలు:
నిందితుడు: ఇస్మాయిల్ రాజ్ షేక్ (38), ఆటో డ్రైవర్, ఆర్.బి. నగర్ కాలనీ, కామారెడ్డి.
మృతులు: 1. సిఫత్ బేగమ్ (8), 2. అయ్యద్ (6), 3. మరియమ్ (5).
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన కామారెడ్డి ఇన్స్పెక్టర్ నరహరి, మరియు రూరల్ ఇన్స్పెక్టర్ రామన్ అదే విధంగా కామారెడ్డి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పి గారు అభినందిచారని ఏఎస్పి తెలిపారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >