| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆరేండ్ల పాపను ఢీ కొట్టిన స్కార్పియో, అక్కడికక్కడే చిన్నారి మృతి

ఆరేండ్ల పాపను ఢీ కొట్టిన స్కార్పియో,  అక్కడికక్కడే చిన్నారి మృతి

డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట :రోడ్డుపై నిలుచున్న ఆరేండ్ల పాపను స్కార్పియో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది. కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రోడ్డులోనీ గాజుల పల్లి శివారు బస్టాండ్ లో బస్సు కోసం వరంగల్ జిల్లాకు చెందిన కొట్టెం పద్మ కుటుంబ సభ్యులు వేచివున్న క్రమంలో స్కార్పియో అతి వేగంగా దూసుకువచ్చి రోడ్డుపై నిల్చున్న పద్మ కూతురు స్వాతి (6)ని డీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. సొంత అన్న కుటుంబ సభ్యులను చూడడానికి పద్మ కుటుంబ సభ్యులు గాజులపల్లి గ్రామానికి వచ్చారు. చూసి తిరుగు పద్మ ఇంటికి ప్రయాణమయ్యే క్రమంలో ఘటన జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి,విచారణ చేపట్టారు. సింగారం గ్రామానికి చెందిన షేక్ అజీజ్ కాంట్రాక్టర్, స్కార్పియోగా పోలీసులు గుర్తించారు. న్యాయం చేయాలని స్వాతి తల్లి పద్మ, కుటుంబసభ్యులు, బంధువులు కోరుతున్నారు.

Previous ఇల్లు ఇప్పించు అయ్యా
Next ఆరేండ్ల పాపను ఢీ కొట్టిన స్కార్పియో, అక్కడికక్కడే చిన్నారి మృతి
ADVERTISEMENT