ప్రేమ పెళ్లికి కత్తి సమాధానమా?
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రేమ వివాహం చేసుకున్నందుకు సొంత అన్నే బావపై కత్తితో దాడి చేయడంతో కోనరావుపేట మండలం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే...
కోనరావుపేట గ్రామానికి చెందిన దండగుల సురేష్ చెల్లెలు మరియా, మల్కాపేటకు చెందిన శివరాత్రి అజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులకు ఈ పెళ్లి ఇష్టం లేదు.
తాత మరణంతో తేదీ 16.08.2026 న మరియా, అజయ్ కోనరావుపేటకు వచ్చారు. అక్కడ సురేష్ తల్లి యాదవ్వతో మరియాకు గొడవ జరిగింది. దీంతో రెచ్చిపోయిన సురేష్, స్నేహితుడు గోగుల రామకృష్ణ తో కలిసి నిమ్మపల్లిలో ఉన్న అజయ్‌పై దాడికి ప్లాన్ వేశాడు.
బైక్‌పై వెళ్లి కత్తితో ఛాతి, కడుపు, వీపుపై పొడిచారు. తీవ్ర గాయాలైన అజయ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల చర్య...
కోనరావుపేట SI కె. ప్రశాంత్ రెడ్డి కేసు నమోదు చేసి 24 గంటల్లోనే సురేష్ మరియు రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నేరానికి వాడిన బైక్, కత్తి సీజ్ చేశారు. వారిని రిమాండ్‌కు పంపారు.
ఈ కేసులో స్పీడ్‌గా పనిచేసిన పోలీస్ టీంను చందుర్తి CI కె. రవీందర్ అభినందించారు.
ప్రేమ వివాహాలపై కుటుంబాల్లో ఇంకా ఉన్న వ్యతిరేకత ఈ ఘటనతో మరోసారి చర్చకు వచ్చింది.