డైలీ భారత్, సిరిసిల్ల: పురపాలక సంఘ కార్యాలయం, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి తేదీ: 18-11-2026 న రిజాయిండర్ జారీ అయింది!
తేదీ: 18-11-2026 రోజున డైలీ భారత్ తెలుగు ఆన్లైన్ దిన పత్రికలో ప్రచురితమైన సిరిసిల్లలో పెన్షన్ల గోల్ మాల్ అనే శీర్షికను అనుసరించి మున్సిపల్ కమిషనర్ తెలిపారు!
సిరిసిల్ల పట్టణంలోని 10వ వార్డు చిన్న బోనాలలోని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా చిన్న బోనాలలో మొత్తం 39 దరఖాస్తులకు సంబంధించి ఈ క్రింది విధంగా వివరాలు సమర్పించడమైనది అని మున్సిపల్ కమిషనర్ తెలిపారు!
వివరాలు సంఖ్య
మొత్తం దరఖాస్తులు 39
ప్రొసీడింగ్స్ జారీ చేయబడ్డవి 27
వెరిఫికేషన్ అధికారి ద్వారా రిజెక్ట్ చేయబడ్డవి 4
వికలాంగుల అర్హత సర్టిఫికేట్ లేనివారు 4
వితంతు పెన్షన్లు గతంలో వున్న పెన్షన్లు మళ్ళీ ప్రారంభం అయినవి 2
దేసత పెన్షన్లు జిల్లా శాఖ ద్వారా రిజెక్ట్ చేయబడినవి 2
పైన తెలిపిన వివరాలకు అనుగుణంగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పెన్షన్ ప్రక్రియ చేపట్టడం జరిగింది అని మున్సిపల్ కమిషనర్ తెలిపారు!
#DailyBharath #Sircilla #CheyuthaPension #MunicipalRejoinder #PensionUpdate