డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మండలంలోని టేక్రియాల్ గ్రామంలో రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు పొలంబడి కార్యక్రమం మరియు ఖేత్ బచావో అభియాన్ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులు, పంటల సంరక్షణ, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు మరియు శాస్త్రీయ సాగు విధానాలపై అవగాహన కల్పించారు. పంటల దిగుబడిని పెంచుకోవడంతో పాటు, చీడపీడల నివారణకు శాస్త్రీయ పద్ధతులను పాటించాలని వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి (DAO) కామారెడ్డి మోహన్ రెడ్డి , డీపీడీ (ఆత్మ) మహిత మేడం , వ్యవసాయ శాస్త్రవేత్త రేవంత్ , ఏడీఏ అపర్ణ , ఏఓ పవన్ కుమార్ , ఏఈఓలు దేవేంద్ర మరియు శ్రీనివాస్ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ లలిత చిట్టి బాబు , PACS డైరెక్టర్ పెద్ద పోతన్నగారి రాజేష్ కుమార్ ,మాజీ కౌన్సిలర్ శంకర్ రావ్ మరియు రైతులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మరియు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు పలు వ్యవసాయ సూచనలు, సలహాలు అందించారు. రైతులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన పొందారు.