| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్లలో పెన్షన్ల గోల్ మాల్! 39 మందిలో 12 మందికి అందని ప్రొసీడింగ్స్! కలెక్టరేట్ ముట్టడిస్తాం అంటున్న కౌన్సిలర్!

సిరిసిల్లలో పెన్షన్ల గోల్ మాల్! 39 మందిలో 12 మందికి అందని ప్రొసీడింగ్స్! కలెక్టరేట్ ముట్టడిస్తాం అంటున్న కౌన్సిలర్!

డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు (చిన్న బోనాల, భూపతి నగర్, ముష్టిపల్లి) ప్రాంతంలో అర్హులైన పెన్షన్ దారులకు అన్యాయం జరిగిందంటూ స్థానిక ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు!

10వ వార్డు నుంచి వికలాంగులు, వితంతువులు, నేతన్నలు మరియు గీత కార్మికులు తదితరులు మొత్తం 39 మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు! మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వీరందరూ అర్హులని నివేదిక పంపినప్పటికీ, చివరికి కేవలం 27 మందికి మాత్రమే ప్రొసీడింగ్స్ అందాయి! మిగిలిన 12 మందికి ప్రొసీడింగ్స్ రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితులు, పదవ వార్డు కౌన్సిలర్ బోల్గం వైష్ణవి నాగరాజు గౌడ్ ను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు! తిండికి కూడా కష్టంగా ఉన్న నిరుపేదలకు, వికలాంగులకు, భర్తలు కోల్పోయిన వితంతువులకు రావాల్సిన పెన్షన్లు నిలిచిపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు!

ఈ విషయమై కౌన్సిలర్ బోల్గం వైష్ణవి నాగరాజు మున్సిపల్ కమిషనర్ ను కలిసి ప్రశ్నించగా, తాము అర్హులందరి జాబితాను పంపామని, కలెక్టరేట్ స్థాయిలో కోత పడిందో లేక ఏం జరిగిందో తమకు పూర్తి వివరాలు తెలియవని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు! దీనికి నిరసనగా, తమ వార్డులోని 12 మంది అర్హులకు కూడా న్యాయం జరిగే వరకు ఎవరికీ ప్రొసీడింగ్స్ తీసుకునేది లేదని స్పష్టం చేస్తూ 10వ వార్డు ప్రజలు ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారు!

అర్హులైన మిగిలిన 12 మందికి వెంటనే పెన్షన్ ప్రొసీడింగ్స్ మంజూరు చేయాలని, లేనిపక్షంలో బాధితులను కలుపుకొని కలెక్టరేట్ ముట్టడితో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కౌన్సిలర్ బోల్గం నాగరాజు ప్రభుత్వానికి మరియు అధికారులకు హెచ్చరిక జారీ చేశారు!

అధికారుల వివరణ:

ఈ విషయంపై మున్సిపల్ అధికారులను అడగగా సాంకేతిక లోపం వల్ల కొంతమందివే అప్డేట్ కాలేదు అనే వివరణ ఇచ్చారు! అర్హులైన మిగిలిన వారికి కూడా త్వరలోనే ప్రొసీడింగ్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు!

#DailyBharath #Sircilla #CheyuthaPension #PensionProtest #CouncillorVaishnavi

Previous వేములవాడలో టెన్షన్! రాజన్న ఆలయ గోపురం కూల్చివేత! బీజేపీ నేతల అరెస్ట్! భక్తుల ఆగ్రహం!
Next రూ 1.50 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ పబ్లిక్ ప్రాసిక్యూటర్!
ADVERTISEMENT