డైలీ భారత్, పెద్దపల్లి: న్యాయస్థానాల్లో బాధితులకు న్యాయం చేకూర్చాల్సిన ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినీతి బాట పట్టి అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు! పెద్దపల్లి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) డొంకెన రవీందర్ బుధవారం రూ 1.50 లక్షల లంచం తీసుకుంటుండగా కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు!
అసలేం జరిగింది?
కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, 2023 లో ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో భూ వివాదం కారణంగా జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు! ఈ ఘటనపై మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన నలుగురిపై హత్య కేసు నమోదైంది!
రూ 2 లక్షలకు బేరం.. రూ 1.50 లక్షలకు ఒప్పందం!
ప్రస్తుతం ఈ కేసు విచారణ నడుస్తుండగా, నిందితులకు శిక్ష పడకుండా వారికి అనుకూలంగా వ్యవహరించి లబ్ధి చేకూరుస్తానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ నిందితుల్లో ఒకరిపై ఒత్తిడి తెచ్చారు! ఇందుకోసం రూ 2 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు! అంత మొత్తం ఇచ్చుకోలేనని బాధితుడు ప్రాధేయపడటంతో చివరకు రూ 1.50 లక్షలకు ఒప్పందం కుదిరింది!
వల పన్ని పట్టుకున్న ఏసీబీ!
లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు నేరుగా కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు! ఫిర్యాదును పరిశీలించిన డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని ఏసీబీ బృందం పక్కా ప్రణాళికతో వల పన్నింది! ముందస్తు పథకం ప్రకారం బుధవారం పెద్దపల్లిలో బాధితుడి నుంచి పీపీ రవీందర్ రూ 1.50 లక్షల నగదును స్వీకరిస్తుండగా అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు! రవీందర్ వద్ద నుంచి రూ 1.50 లక్షల లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు!
కరీంనగర్ ప్రత్యేక కోర్టులో హాజరు!
కునారం గ్రామానికి చెందిన డొంకెన రవీందర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, తదుపరి విచారణ నిమిత్తం కరీంనగర్ కు తరలించారు! కేసు దర్యాప్తు పూర్తయిన అనంతరం బుధవారం సాయంత్రం కరీంనగర్ లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన్ను హాజరుపరచనున్నారు! కోర్టు వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లంచం తీసుకుంటూ పట్టుబడటం ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యాయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది!
#DailyBharath #Peddapalli #ACB #ACBRaid #PublicProsecutor #DonkenaRavinder #TelanganaNews #KarimnagarACB #BriberyCase