డైలీ భారత్, నర్సంపేట: ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జిల్లా మాధ్యమిక విద్యాధికారి (డీఐఈఓ) డా శ్రీధర్ సుమన్ పేర్కొన్నారు! బుధవారం నర్సంపేటలోని పలు ఆసుపత్రుల్లో ఎస్ఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థుల శిక్షణ కేంద్రాలను ఆయన సందర్శించారు!
ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం వృత్యంతర శిక్షణ తప్పనిసరని, విద్యార్థుల అనుభవం, రికార్డుల ఆధారంగానే మార్కులు కేటాయిస్తామని తెలిపారు! ఆసుపత్రుల్లోని ఓపీ, క్రిటికల్ కేర్, ఐసీయూ, ల్యాబ్స్, రిపోర్టింగ్ సెల్ విభాగాల్లో విద్యార్థుల పనితీరుతో పాటు హాజరు, రోజువారీ రికార్డులను పరిశీలించారు!
వృత్తి విద్యలో రాణించేలా జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నట్లు చెప్పారు! ప్రిన్సిపాల్ సనత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు!
#DailyBharath #Narsampet #VocationalEducation #OJT #DIEO #SridharSuman #Warangal #TelanganaEducation