మద్దిశెట్టి ని అభినందించిన అధిష్టానం
డైలీ భారత్, న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యాలయంలో మద్దిశెట్టి సామేలు బృందం ఎన్సీపీ ఎన్‌వైసీ జాతీయ అధ్యక్షులు ధీరజ్ శర్మ ను కలిసి సమావేశమైంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన పలు సమస్యలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించారు.
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం, ఎన్‌వైసీ కార్యకలాపాలపై కూడా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్‌వైసీ అధ్యక్షుడిని వీలైనంత త్వరగా నియమించాలని ధీరజ్ శర్మ మద్దిశెట్టి సామేలుకు సూచించారు.
అలాగే, వచ్చే నెల చివరిలో తెలంగాణ రాష్ట్రంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్, రాజ్యసభ ఎంపీ పార్ధ్ పవార్ ను హైదరాబాద్‌కు తీసుకువచ్చి భారీ స్థాయిలో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పూర్తి భాద్యతలను అప్పగిస్తూ మద్దిశెట్టిని ఆదేశించిన అధిష్టానం.