| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అదృష్టం పేరుతో మోసం... టాస్క్‌ఫోర్స్ వలలో 6 మంది

అదృష్టం పేరుతో మోసం... టాస్క్‌ఫోర్స్ వలలో 6 మంది

నకిలీ పంచలోహ రాకెట్ బట్టబయలు

డైలీ భారత్, హైదరాబాద్: "ఈ విగ్రహం, రాయి అదృష్టం తెస్తాయి" అని నమ్మించి నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని, గులాబీ రంగు రాయిని అధిక ధరకు అమ్మేందుకు ప్రయత్నించిన 6 మంది మోసగాళ్లను కమిషనర్ టాస్క్‌ఫోర్స్, జూబ్లీహిల్స్ జోన్ టీమ్ మైలార్‌దేవ్‌పల్లి పోలీసుల సహకారంతో పట్టుకుంది.

లక్ష్మిగూడ, కాటేదాన్ ప్రాంతంలో కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో పోలీసులు దాడి నిర్వహించారు. దాడుల్లో నిందితుల నుంచి నకిలీ పంచలోహ విగ్రహం, ఒక రాయి, TS04B0549 నమోదు నంబర్ గల ఎర్టిగా కారు, 5 సెల్‌ఫోన్లు, తెలియని ద్రవం ఉన్న 3 సీసాలు, 2 ఎర్ర తువ్వాళ్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2024లో చల్ల రవి, కొండపెల్లి భిక్షపతి తదితరులు నిందితుడు పి. నరసింహను మోసం చేసి నకిలీ విగ్రహాన్ని ఇచ్చినట్లు, ఆ తర్వాత అతడు ఇతరులతో కలిసి దాన్ని అమ్మేందుకు ప్రయత్నించినట్లు తేలింది. అదేవిధంగా కేతావత్ రాజు @ కటప్ప వద్ద ఉన్న గులాబీ రాయిని కూడా మంచి ధరకు అమ్మాలని ఈ ముఠా ప్లాన్ చేసింది. 

ఆ విగ్రహానికి, రాయికి దైవిక శక్తులు ఉన్నాయని, అదృష్టం, సంపద కలిగిస్తాయని అబద్ధపు ప్రచారం చేసి ప్రజలను మోసం చేసేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

అరెస్ట్ చేసిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చర్యల కోసం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.

ఈ ఆపరేషన్‌ను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సి. యాదేందర్, ఎస్సై జి. సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో వారి బృందం నిర్వహించింది.

Tags: #HyderabadNews #TaskForce #FakeIdol #Mailardevpally #TeluguNews

Previous ₹7 లక్షల క్రిప్టో మోసం... ఫేస్‌బుక్‌లో ఉచ్చు వేసి దోచుకున్న ముఠా గుట్టు రట్టు
Next అన్న vs బావ... కత్తి దాడితో హాట్ టాపిక్ అయిన కోనరావుపేట
ADVERTISEMENT