డైలీ భారత్, మరిపెడ: అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రజ మృతి చెందారు.
సెయింట్ లూయిస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్న సుప్రజ.. రాత్రి రెస్టారెంట్ మూసివేసిన అనంతరం స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపటికే వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సుప్రజ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెతో ఉన్న స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సుప్రజకు భర్త, కుమారుడు ఉన్నారు. ఈ విషాద ఘటనతో మరిపెడలోని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.