డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణలో మద్యం ప్రియులకు బిగ్ షాక్. రేపు అక్టోబర్ 5 (సోమవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి.
ప్రభుత్వం లైసెన్స్ ఫీజులు, ప్రివిలేజ్ సెస్ ను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ తెలంగాణ బార్ & రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
అసలు కారణాలు ఇవే:
లైసెన్స్ ఫీజు రూ.40 లక్షల నుంచి రూ.44 లక్షలకు పెంపు
ప్రివిలేజ్ సెస్ 8% నుంచి 20% కి పెంపుదీంతో ఒక్కో బార్ పై ఏటా రూ.30 లక్షల అదనపు భారం
బెల్ట్ షాపులు, పర్మిట్ రూములతో వ్యాపారం దెబ్బతింటోందని ఆవేదన
బంద్ ఎఫెక్ట్:
రాష్ట్రంలో 1,185 బార్లు బంద్ కానున్నాయి. సోమవారం నాంపల్లి ఎక్సైజ్ భవన్ ముట్టడికి అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోకపోతే నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు.