రూ 20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టోలిచౌకి SHO టి రమేశ్ నాయక్! నెలకు రూ 50 వేలు డిమాండ్! స్టేషన్ లో లెక్కలేని రూ 50 వేలు స్వాధీనం!
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ లోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ SHO టి రమేశ్ నాయక్ రూ 20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు!
ఘటన నేపథ్యం:
అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా హోటల్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చేందుకు, ఒక హోటల్ యజమానిని SHO ప్రతి నెలా రూ 50 వేలు లంచం డిమాండ్ చేశారు!
గత వసూళ్లు:
ఇప్పటికే విడతల వారీగా రూ 10 వేలు, అక్టోబర్ 31న మరో రూ 20 వేలు వసూలు చేశారు!
ఏసీబీ దాడి:
మిగిలిన రూ 20 వేల కోసం ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు! పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు, పోలీస్ స్టేషన్ లోనే రూ 20 వేలు తీసుకుంటుండగా రమేశ్ నాయక్ ను పట్టుకున్నారు!
నగదు స్వాధీనం:
అనంతరం స్టేషన్ లో తనిఖీలు నిర్వహించగా, లెక్కల్లో చూపని రూ 50 వేల నగదు లభ్యమైంది! ఏసీబీ అధికారులు ఆ నగదును సీజ్ చేసి, SHO రమేశ్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు! ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచనున్నారు!
#DailyBharath #ACB #Tolichowki #Hyderabad #SHO #Bribery #ACBRaid #TelanganaPolice