డైలీ భారత్, కామారెడ్డి: అత్యవసర సమయంలో మానవత్వం చాటిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 ఏళ్ల చిన్నారికి A+ ప్లేట్లెట్స్ అత్యవసరంగా అవసరమయ్యాయి. విషయం తెలుసుకున్న పేషెంట్ కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు.
సమాచారం అందిన వెంటనే స్పందించిన బీజేపీ మాచారెడ్డి మండల అధ్యక్షుడు సురేష్ గారు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరుకుని ప్లేట్లెట్స్ దానం చేశారు. ఆయన చొరవతో చిన్నారికి సకాలంలో చికిత్స అందింది.
మానవత్వానికి నిదర్శనం
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, "ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మన బాధ్యత. రక్తం, ప్లేట్లెట్స్ దానం అంటే ఒక కుటుంబానికి కొత్త జీవితం ఇవ్వడమే" అని అన్నారు.
జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బొనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ లు సురేష్ ను అభినందించారు. యువ నాయకులు ఇలా సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పేషెంట్ కుటుంబ సభ్యులతో పాటు గుండెల్లి ప్రశాంత్, ప్రసాద్, KBS బ్లడ్ సెంటర్ ప్రతినిధులు జీవన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
సహాయం కోసం:
ఎవరికైనా ఎప్పుడైనా రక్తం లేదా ప్లేట్లెట్స్ అవసరమైతే సంప్రదించండి: 9666620006, 9848687025