డైలీ భారత్, వేములవాడ: పెళ్లి లాంటి శుభకార్యాన్ని సామాజిక సేవతో సార్థకం చేసుకున్న ఉదాహరణ వేములవాడలో కనిపించింది.
AVOPA వేములవాడ యూనిట్ విజ్ఞప్తితో స్పందించిన స్థానిక దాతలు గుండ అశోక్, లతాశ్రీ దంపతులు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు రాగిజావ పంపిణీ కోసం చేయూతనిచ్చారు.
తమ కుమార్తె దీక్షిత, సాయి శ్రవణ్ ల వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 6 వేల రూపాయల విలువైన 200 స్టీల్ గ్లాసులను పాఠశాలకు విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా AVOPA వేములవాడ యూనిట్ అధ్యక్షులు వంగళ మహేశ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంక్షేమం కోసం తమ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని, దాతల సహాయంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. వెంటనే స్పందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో AVOPA ప్రధాన కార్యదర్శి ఆమెటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు తాటికొండ పవన్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్ది సత్యనారాయణ, మంటప హనుమాన్ భజన మండలి అధ్యక్షులు కటకం నాగరాజు, మురికి కృష్ణ, గుండ సామంత్ తదితరులు పాల్గొన్నారు.
దాతల సేవను అభినందిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం వారిని ఘనంగా సన్మానించారు.
ఇలాంటి దాతల వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి.
#RajannaSircilla #Vemulawada #AVOPA #GovernmentSchool #TelanganaNews