| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిగే చంటి కుటుంబాన్ని పరామర్శించిన జూలూరుపాడు మండల బిఆర్ఎస్ నాయకులు

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిగే చంటి కుటుంబాన్ని పరామర్శించిన జూలూరుపాడు మండల బిఆర్ఎస్ నాయకులు

డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన డీలర్, బిఆర్ఎస్ ,ఆదివాసీ సంఘం నాయకుడు గలిగే లక్ష్మయ్య(అలియాస్ చంటి) కుటుంబాన్ని  బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. చంటి  మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  చంటి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు చాపలమడుగు రామ్మూర్తి మాట్లాడుతూ 

బి ఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చంటి ప్రజలతో మంచి సంబంధాలను కలిగి ఉండి వారి సమస్యల పరిష్కారంలో పాలుపంచుకున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు మార్కాపూరి నరసింహారావు, భోగిని కృష్ణ, తాళ్లూరి రామారావు, ఇల్లంగి తిరపతి, కమలాకర్ బుడిబుడి ప్రతాప్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Previous కల్లూరు పట్టణంలో నిరుపేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ
Next గలిగే లక్ష్మయ్య(చంటి) చిత్రపటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మీ మదన్లాల్
ADVERTISEMENT