| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇల్లు ఇప్పించు అయ్యా

ఇల్లు ఇప్పించు అయ్యా

వినోద్ కుమార్ ను వేడుకున్న మహిళా

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించమంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ ముందు ఓ మహిళా కంటతడి పెట్టింది. ఆదివారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన వినోద్ కుమార్ కు పట్టణంలోని 29వ వార్డు ప్రగతి నగర్ కు చెందిన బైరవేణి భారతి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలని వినతి పత్రం అందజేసి కాళ్లపై పడ్డది. కన్నీరు పెడుతూ తన గోడు వేల్లబోసుకుంది. నాలుగుసార్లు అప్లికేషన్ పెట్టుకున్న తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని, అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారని వాపోయింది. తమకు పిల్లలు లేరని, పాతికేళ్లుగా భార్యాభర్తలం కిరాయి ఇండ్లలో ఉంటున్నామని చెప్పింది. ఒక గేదె ఇచ్చే పాలు, బీడీ ఫించన్ ఆధారపడి జీవిస్తున్నామని, తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించాలని వినోద్ కుమార్ ను వేడుకుంది.

Previous ఈ నెల 10న మంగళవారం వేములవాడలో మెగా డ్రోన్‌ షో
Next ఆరేండ్ల పాపను ఢీ కొట్టిన స్కార్పియో, అక్కడికక్కడే చిన్నారి మృతి
ADVERTISEMENT