| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేశంలో ఉన్న అన్ని పారిశ్రామిక వాడలో రాజకీయ పార్టీలన్నీ సీట్లు కార్మికులకు ఇచ్చి తీరాల్సిందే : రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

దేశంలో ఉన్న అన్ని పారిశ్రామిక వాడలో రాజకీయ పార్టీలన్నీ  సీట్లు కార్మికులకు ఇచ్చి తీరాల్సిందే : రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేసిన రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు 

డైలీ భారత్, హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో ఉన్న అన్ని పారిశ్రామిక వాడలో కార్మికులకే సీట్లు ఇవ్వాలని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కార్మిక నాయకుడు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు గ్రహీత రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు డిమాండ్ చేశారు 

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కార్మికులకు రాజకీయపరమైన వాటా గాని సరైన ప్రాధాన్యం గాని  ఇవ్వలేదని మా సమస్యలు మా హక్కుల కోసం మేమే పోరాడుతామని చట్టసభల్లో మాకు ప్రాధాన్యం ఉన్నప్పుడే మా సమస్యలు పరిష్కారం అవుతాయని కాబట్టి దేశంలో ఉన్న అన్ని పారిశ్రామికవాడిలో కార్మికులకు సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని కరాకండిగా తెగించి చెప్పారు కార్మికులు రాజకీయ పార్టీలు చుట్టూ తిరిగే కాలం పోయిందని కార్మిక ఓట్లు కార్మికులకు వేసుకొని కార్మిక అభ్యర్థిని గెలిపించుకొని చట్టసభల్లో ప్రాథమిక పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు కార్మికులకు రాజకీయపరమైన వాటా ఇవ్వడం న్యాయమైన డిమాండ్ అని అది ఎప్పుడో ఇచ్చి ఉండాల్సిందని ఇప్పటికై అవి సాధిస్తామని పూర్తి విశ్వాసం నమ్మకం ఉందని ఆడారి నాగరాజు  తెలియజేశారు

Previous బాబు గారికి తోడుగా.. ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం-ఆవునూరి దయాకర్ రావు
Next ఎండు గంజాయి రవాణా మరియు అమ్మకం దారుల అరెస్ట్ : ఎక్సైజ్ సి.ఐ ముస్తాఫా
ADVERTISEMENT