| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎండు గంజాయి రవాణా మరియు అమ్మకం దారుల అరెస్ట్ : ఎక్సైజ్ సి.ఐ ముస్తాఫా

ఎండు గంజాయి రవాణా మరియు అమ్మకం దారుల అరెస్ట్ : ఎక్సైజ్ సి.ఐ ముస్తాఫా

డైలీ భరత్, రాజన్న సిరిసిల్ల : జిల్లా ఎక్సైజ్ అధికారి సామల పంచాక్షరీ మరియు కరీంనగర్ ఎక్సైజ్ ఉప కమీషనర్ విజయ భాస్కర్ రెడ్డి ల విశ్వసనీయమైన సమాచారం మేరకు సిరిసిల్ల ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ మరియు సిరిసిల్ల ఎక్సైజ్ సిబ్బంది సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ ముందు ఎం.డి.నయీమ్( మార్కేండాయ వీధి సిరిసిల్ల)  గంజాయి నాందేడ్ నుంచి తెచ్చి  చింతకుంట సంతోష్ (గాంధీ చౌక్ సిరిసిల్ల)  అను అతనికి విక్రయిస్తుండగా, ఎక్సైజ్ వారు పట్టుకొని సోదాచేయగా వీరి వద్ద 36 గ్రాముల గంజాయి లభ్యం ఐనదని ఎక్సైజ్ సి.ఐ. శ్రీ గులామ్ ముస్తాఫా తెలిపారు. గంజాయి రవాణా చేయడం , కల్గి ఉండడం మరియు సేవించడం మత్తు పదార్థాల నిరోధక చట్టం ప్రకారం నేరం అని తెల్పి , మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి కరీంనగర్ జైలు కు తరలించడమైనదని ముస్తాఫా తెలిపారు. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ యస్సై శైలజ , సిరిసిల్ల ఎక్సైజ్ యస్సై లు ముకుంద శేఖర్ మరియు రాజెందర్ పాల్గొన్నారు. ఇట్టి గంజాయి పట్టుకున్న సిబ్బంది ఎ.శ్రీనివాస్ , జి.శ్రీనివాస్, నరెందర్ , మధుకర్, రాకేష్, సుమన్  మరియు శంకర్ లను అధికారులు అభినందించారు.

Previous దేశంలో ఉన్న అన్ని పారిశ్రామిక వాడలో రాజకీయ పార్టీలన్నీ సీట్లు కార్మికులకు ఇచ్చి తీరాల్సిందే : రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
Next ఏనుగు దాడిలో జంతు సంరక్షకుడు మృతి
ADVERTISEMENT