డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ హనుమాన్ యోగ కేంద్రంలో స్థానిక రామాలయంలోఆదివారం రోజు ఉదయం ప్రత్యేక హోమ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు.. అనంతరం హనుమాన్ చాలీసా పఠనం చేశారు.ఈ హోమంలో చిదుర శ్రీధర్ దంపతులు పాల్గొని ప్రత్యేక హోమం పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. అనంతరం అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చిదుర శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ హనుమాన్ యోగ సభ్యులు గరిపల్లి అంజయ్య, ఎల్లంకి సుదర్శన్,పార్శి ఈశ్వర్, గోపాల్ లోయ,నక్క సిద్ధిరాములు తదితరులు యోగ సభ్యులు పాల్గొన్నారు.
News
హనుమాన్ యోగ కేంద్రంలో ప్రత్యేక హోమం...