కామారెడ్డి ( డైలీ భారత్): ముదిరాజ్ జాతికి సీఎం ఇచ్చిన హామీ బీసీ-A (GO MS No.15) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ & విద్యావంతులు, ఉద్యోగులు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారని జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సుదీర్ఘకాలంగా ముదిరాజ్ జాతి ఎదుర్కొంటున్న సమస్య బీసీ-A అమలు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి వెంటనే GO MS No.15 అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ జనాభాలో మెజార్టీ ఓట్లు ఉన్న ముదిరాజ్ యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. EWS పేరుతో అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన ప్రభుత్వం ముదిరాజ్ సమస్యను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ముదిరాజ్ యువత, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇది ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. హామీ అమలు చేయకపోతే యువత, మహిళలు, నిరుద్యోగులతో కలిసి ధర్మయుద్ధ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగుల సంఘం కన్వీనర్ బాలకిషన్ ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు డా. లింబాద్రి ముదిరాజ్, ధర్మపురి ముదిరాజ్, లింగం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.