రాజన్న సిరిసిల్ల (డైలీ భారత్) : గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కొలనురు గ్రామంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
రాజన్న సిరిసిల్ల ఐఎంఏ ఆధ్వర్యంలో, అశ్విని హాస్పిటల్ సౌజన్యంతో జరిగిన ఈ శిబిరాన్ని సర్పంచ్ జలగం అరవింద్ రావు, ఉప సర్పంచ్ బిట్ల బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ శిబిరంలో 150 మందికి పైగా రోగులు పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వైద్యులు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు.
డా. చికోటి సంతోష్, డా. సాయి కుమార్, డా. జైల్ సింగ్, డా. అభినయ్ గోవర్ధన స్వామి, డా. మాధవి, డా. ప్రవీణ్ వర్మ, పీఆర్వో హరీష్, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.
వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ కు, ఐఎంఏ బృందానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.